Home /News /technology /

ALERT FOR WHATSAPP PAYMENTS USERS YOU MAY LOSE MONEY WITH WHATSAPP QR CODE SCAM SS

WhatsApp QR Code Scam: వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్... మీరూ మోసపోవచ్చు జాగ్రత్త

WhatsApp QR Code Scam: వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్... మీరూ మోసపోవచ్చు జాగ్రత్త
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp QR Code Scam: వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్... మీరూ మోసపోవచ్చు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp QR Code Scam | టెక్నాలజీ పెరిగిన కొద్దీ కొత్తకొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి మోసాల్లో వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్ కూడా ఒకటి. ఇలాంటి మోసాలబారిన పడకుండా వాట్సప్ యూజర్లు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

    వాట్సప్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే 40 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సప్ వాడుతున్నారని అంచనా. ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్. కొన్నాళ్ల క్రితం వాట్సప్ పేమెంట్స్ (WhatsApp Payments) పేరుతో వాట్సప్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం అయ్యాయి. వాట్సప్ యూజర్లు తమ మొబైల్ ద్వారా సులువుగా పేమెంట్స్ చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు వాట్సప్ యూజర్లను దోచేస్తున్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఆ కోడ్‌ పంపించి వాట్సప్ యూజర్ల ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలను వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్ (WhatsApp QR code scam) అని పిలుస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? మీరు మోసపోకుండా ఏం చేయాలి? తెలుసుకోండి.

    వాట్సప్ క్యూఆర్ కోడ్ స్కామ్ ఎలా జరుగుతుంది?


    ఇంటర్నెట్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ప్లాట్‌ఫామ్‌లో ప్రొడక్ట్స్‌ని పోస్ట్ చేసేవారిని మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన ప్రొడక్ట్ తమకు నచ్చిందని, తాము కొంటామని మాటలు కలుపుతారు. బేరం కుదుర్చుకుంటారు. వాట్సప్ ద్వారా పేమెంట్ చేస్తామని నమ్మిస్తారు. మోసగాళ్లు తమ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేసి, ఆ కోడ్ స్కాన్ చేస్తే అడ్వాన్స్ పేమెంట్ వస్తుందని నమ్మిస్తారు. యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పిన్ ఎంటర్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.

    Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్... మే 11 నుంచి ఈ సర్వీస్ ఉండదు

    డబ్బులు స్వీకరించడానికి యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. తమ క్యూఆర్ కోడ్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మోసపోతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి.

    ఈ మోసం నుంచి ఎలా బయటపడాలి?


    మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే వారి క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు డబ్బులు పొందాలనుకుంటే మీ క్యూఆర్ కోడ్ షేర్ చేయాలి. అంతే తప్ప మీరు డబ్బులు స్వీకరించడానికి ఇతరులు పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరి నుంచైనా డబ్బులు రావాల్సి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు.

    Apple iPhone: రూ.8,199 ధరకే సెకండ్ హ్యాండ్ యాపిల్ ఐఫోన్... ఇంకొన్ని గంటలే ఆఫర్

    గుర్తుతెలియని వ్యక్తుల నుంచి క్యూఆర్ కోడ్ వస్తే పట్టించుకోకూడదు. ఆ క్యూఆర్ కోడ్ అస్సలు స్కాన్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటే అమౌంట్ కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. ఒకవేళ మీరు మోసపోయినట్టైతే https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CYBER FRAUD, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు