Home /News /technology /

ALERT FOR TRUECALLER USERS AFTER GOOGLES NEW RULE TRUECALLER TO STOP CALL RECORDING FEATURE ON ANDROID SMARTPHONES SS

Truecaller: ట్రూకాలర్ యూజర్లకు షాక్... గూగుల్ కొత్త రూల్‌తో ఆ ఫీచర్ పనిచేయదు

Truecaller: ట్రూకాలర్ యూజర్లకు షాక్... గూగుల్ కొత్త రూల్‌తో ఆ ఫీచర్ పనిచేయదు
(ప్రతీకాత్మక చిత్రం)

Truecaller: ట్రూకాలర్ యూజర్లకు షాక్... గూగుల్ కొత్త రూల్‌తో ఆ ఫీచర్ పనిచేయదు (ప్రతీకాత్మక చిత్రం)

Truecaller | ట్రూకాలర్ యాప్ యూజర్లకు కంపెనీ షాక్ ఇచ్చింది. గూగుల్ కొత్త నియమనిబంధనలతో (Google New Rules) ఓ ఫీచర్‌ని నిలిపివేస్తోంది. దీంతో లక్షలాది ట్రూకాలర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ట్రూకాలర్ యాప్ వాడుతున్నవారికి ఊహించని ఎదురుదెబ్బతగిలింది. ట్రూకాలర్ (Truecaller ) వాడేవారిలో ఎక్కువగా ఆ యాప్‌లో ఉన్న కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కాల్ రికార్డింగ్ (Call Recording) కోసమే ట్రూకాలర్ యాప్ డౌన్‌లోడ్ చేసేవాళ్లు ఉన్నారు. కానీ గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయంతో ట్రూకాలర్ కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించనుంది. గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా అప్‌డేట్ చేసినందున ఫోన్ కాల్స్ రికార్డ్ చేసే ఆప్షన్‍ను నిలిపివేస్తున్నట్టు ట్రూకాలర్ ప్రకటించింది. యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్‌‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ నిలిపివేస్తోంది గూగుల్.

ట్రూకాలర్ భారతదేశంలో పాపులర్ డయలర్ యాప్స్‌లో ట్రూకాలర్ కూడా ఒకటి. ఈ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌కు డిమాండ్ కూడా ఎక్కువ. యూజర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్నాళ్ల క్రితమే ఈ ఫీచర్ రిలీజ్ చేసింది ట్రూకాలర్. కానీ ట్రూకాలర్ ఈ ఫీచర్ నిలిపివేయడం యూజర్లకు పెద్ద లోటు కానుంది.

Samsung Galaxy M53: అదిరిపోయే ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం53 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

యూజర్ల నుంచి అభ్యర్థనలు రావడంతో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ తీసుకొచ్చాం. ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉచితం. పర్మిషన్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందుకోసం గూగుల్ యాక్సెసబిలిటీ ఏపీఐ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. కానీ గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీస్ కారణంగా ఇకపై తాము కాల్ రికార్డింగ్ ఫీచర్ అందించలేకపోతున్నాం.
News18 Tech తో ట్రూకాలర్ అధికార ప్రతినిధి


గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ యాప్స్ ఏవీ మే 11 నుంచి పనిచేయవు. ఇక ట్రూకాలర్ లాంటి యాప్స్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్నా ఆ ఫీచర్ పనిచేయదు. అయితే ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రీలోడెడ్‌గా కాల్ రికార్డర్ యాప్ ఉంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ పనిచేస్తుంది. షావోమీ, సాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో లాంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కాల్ రికార్డర్ యాప్‌ను ప్రీలోడెడ్‌గా అందిస్తున్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ పనిచేస్తుంది.

Apple iPhone: రూ.8,199 ధరకే సెకండ్ హ్యాండ్ యాపిల్ ఐఫోన్... ఇంకొన్ని గంటలే ఆఫర్

కాల్ రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఆ యాప్ మే 11 నుంచి పనిచేయవు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ యాప్ లేదా ఫీచర్ లేకపోతే మే 11 నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లో కాల్స్ రికార్డ్ చేయడం సాధ్యం కాదు. అయితే ఎవరిదైనా కాల్ రికార్డ్ చేయాలనుకుంటే స్పీకర్ ఆన్ చేసి మరో స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ రికార్డింగ్ యాప్ ఉపయోగించి రికార్డ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Android, Google, Smartphone, Truecaller

తదుపరి వార్తలు