హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Mistakes: మీరు ఏ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నా ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Smartphone Mistakes: మీరు ఏ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నా ఈ తప్పులు మాత్రం చేయొద్దు

6. మీ ఫైల్ తొలగించబడిన అదే స్థానానికి రిస్టోర్ చేయబడుతుంది. అంతే కాకుండా క్లౌడ్‌లో గూగుల్ 15GB స్టోరేజీని ఉచితంగా అందిస్తుంది, ఆ తర్వాత వినియోగదారులు Google One ప్లాన్ ద్వారా చెల్లింపు స్టోరేజీని కొనుగోలు చేయాలి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. మీ ఫైల్ తొలగించబడిన అదే స్థానానికి రిస్టోర్ చేయబడుతుంది. అంతే కాకుండా క్లౌడ్‌లో గూగుల్ 15GB స్టోరేజీని ఉచితంగా అందిస్తుంది, ఆ తర్వాత వినియోగదారులు Google One ప్లాన్ ద్వారా చెల్లింపు స్టోరేజీని కొనుగోలు చేయాలి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Smartphone Mistakes | స్మార్ట్‌ఫోన్ యూజర్లు చేసే తప్పులు వారికి చిక్కులు తీసుకొస్తూ ఉంటాయి. మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.

స్మార్ట్‌ఫోన్... ఒకప్పుడు ఇది లగ్జరీ. కానీ ఇప్పుడు ఇది ఓ అవసరం. స్మార్ట్‌ఫోన్ ఉంటే ఆన్‌లైన్ చదువుల నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు అన్నీ జరిగిపోతున్నాయి. అందుకే కాస్ట్‌లీ దుస్తులు మెయింటైన్ చేయకపోయినా మంచి స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉండాలనుకునేవారు ఉన్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ మెయింటైన్ చేసే విషయంలో యూజర్లు చేసే కొన్ని తప్పులు తిప్పలు పెడుతుంటాయి. డేటా ఉంది కదా అని ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేయడం, యాప్స్ కోసం థర్డ్ పార్టీ యాప్‌స్టోర్లు ఓపెన్ చేయడం లాంటి తప్పులతో చిక్కులు తప్పవు. సైబర్ నేరగాళ్ల (Cyber Fraudsters) చేతుల్లో చిక్కుకోవడానికి ఈ తప్పులే కారణం అవుతుంటాయి. మరి మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయొద్దు.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటే అందులో గూగుల్ యాప్స్‌తో పాటు బ్లోట్‌వేర్ చాలా ఉంటుంది. ఆ యాప్స్‌తో అసలు అవసరమే ఉండదు. అయినా వాటిని డిలిట్ చేయకుండా అలాగే వదిలేయడం పొరపాటే. కొత్త ఫోన్ ఆన్ చేసిన వెంటనే అవసరం లేని యాప్స్‌ని డిలిట్ చేయాలి. వాటితో స్పేస్ నిండిపోవడం మాత్రమే కాదు... అనేక చిక్కులు ఉంటాయి. అందుకే ఆ యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి

స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు బాధపడతారు కానీ... అంతకన్నా ముందు చేయాల్సిన సెట్టింగ్స్ చేయరు. స్మార్ట్‌ఫోన్ కొనగానే గూగుల్ ఫైండ్ డివైజ్ సర్వీస్ ఉపయోగించడానికి సెట్టింగ్స్ చేయాలి. ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచాలి. ఎవరైనా మీ స్మార్ట్‌ఫోన్ దొంగిలించినా, మీరే ఎక్కడైనా మొబైల్ పారేసుకున్నా ఫైండ్ మై డివైజ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పాస్‌వర్డ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేయకూడదు.

ఏదైనా అవసరం కోసం యాప్ డౌన్‌లోడ్ చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం అలవాటు. రెండుమూడు నెలలకు ఓసారైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యాప్స్ రివ్యూ చేయాలి. అవసరం లేని యాప్స్ ఉంటే డిలిట్ చేయాలి. ఇక సెట్టింగ్స్‌లో డౌన్‌లోడ్ చేసిన యాప్స్ లిస్ట్ ఉంటుంది. అందులో మీ ప్రమేయం లేకుండా డౌన్‌లోడ్ అయిన యాప్స్ ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

Apple AirPods: ట్యాబ్లెట్ అనుకొని ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ... ఆ తర్వాత ఏం జరిగిందంటే

మీరు యాప్స్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే ఉపయోగించాలి. యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు ఇస్తున్న పర్మిషన్స్ వివరాలు తెలుసుకోవాలి. నియమనిబంధనల్ని చదవాలి. అవసరం లేకపోయినా మీ స్మార్ట్‌ఫోన్‌లో కాంటాక్ట్స్, లొకేషన్, కాల్ డేటా లాంటి వివరాలు సేకరించే యాప్స్ ఉంటాయి. అలాంటి యాప్స్‌తో జాగ్రత్త. ఏపీకే ఫైల్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయకూడదు. ఏపీకే ఫైల్స్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌తో రిస్క్ ఎక్కువ.

First published:

Tags: Android, Mobile App, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు