Home /News /technology /

ALERT FOR SMARTPHONE USERS JOKER MALWARE FOUND IN THESE 50 APPS DELETE THESE APPS IMMEDIATELY SS

Dangerous Apps: ఈ 50 యాప్స్‌ డేంజరస్... మీ మొబైల్‌లో ఏ ఒక్కటి ఉన్నా డిలిట్ చేయండి

Dangerous Apps: ఈ 50 యాప్స్‌ డేంజరస్... మీ మొబైల్‌లో ఏ ఒక్కటి ఉన్నా డిలిట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Dangerous Apps: ఈ 50 యాప్స్‌ డేంజరస్... మీ మొబైల్‌లో ఏ ఒక్కటి ఉన్నా డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Dangerous Apps | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాల్‌వేర్ యాప్స్ (Malware Apps) పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా మరో 50 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్ యాప్స్ బయటపడ్డాయి.

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. మరిన్ని డేంజరస్ యాప్స్ బయటపడ్డాయి. సెక్యూరిటీ అనలిటిక్స్ సంస్థ అయిన Zscaler Threatlabz జోకర్ మాల్‌వేర్ ఉన్న 50 యాప్స్‌ని గుర్తించింది. ఈ యాప్స్‌ని వెంటనే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి డిలిట్ చేయాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఈ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అయితే వీటిని డౌన్‌లోడ్ చేసిన యూజర్లు యాప్స్ వాడే అవకాశం ఉంది. ఈ యాప్స్ వాడితే రిస్కు తప్పదు. అందుకే ఈ 50 యాప్స్‌లో ఏ యాప్ ఉపయోగిస్తున్నా మొబైల్ నుంచి డిలిట్ చేయడం అవసరం. Zscaler Threatlabz అధ్యయనం ప్రకారం జోకర్, ఫేస్ స్టీలర్, కోపర్ మాల్‌వేర్ ఎక్కువగా యాప్స్‌లో కనిపిస్తున్నాయి. ఇవన్ని ప్రమాదకరమైన యాప్స్. మరి తాజాగా బయటపడ్డ 50 యాప్స్ జాబితా ఇక్కడ తెలుసుకోండి.

జోకర్ మాల్‌వేర్ ఉన్న 50 యాప్స్ ఇవే...


1. Advanced SMS
2. All Language Translate
3. All Photo Translator
4. Blood Pressure Checker
5. Blood Pressure Diary
6. Camera Translator
7. Chat SMS
8. Chat Text SMS
9. Classic Game Messenger
10. Come Messages
11. Cool Keyboard
12. Cool Messages
13. Creative Emoji Keyboard
14. Custom Themed Keyboard
15. Emoji Theme Keyboard
16. Fancy SMS
17. Fonts Emoji Keyboard
18. Fonts Emoji Keyboard
19. Funny Emoji Message
20. Funny Keyboard
21. Hi Text SMS
22. iMessager
23. Instant Messenger
24. Light Messages
25. Magic Photo Editor
26. Memory Silent Camera
27. Mini PDF Scanner
28. Painting Photo Editor
29. Personal Message
30. Premium SMS
31. Private Game Messages
32. Private Messenger
33. Professional Messages
34. Professional Messenger
35. Quick Talk Message
36. Rich Theme Message
37. Send SMS
38. Simple Note Scanner
39. Smart Messages
40. Smart SMS Messages
41. Smile Emoji
42. Social Message
43. Style Message
44. Text Emoji SMS
45. Text SMS
46. Themes Chat Messenger
47. Themes Photo Keyboard
48. Timestamp Camera
49. Universal PDF Scanner
50. Wow Translator

Amazon Prime Day: 128GB స్టోరేజ్, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా... ఆఫర్ ధర రూ.9,999 మాత్రమే

ఈ యాప్స్‌లో కమ్యూనికేషన్, హెల్త్, పర్సనలైజేషన్, ఫోటోగ్రఫీ, టూల్స్ కేటగిరీ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ యాప్స్‌ని 300,000 సార్లు డౌన్‌లోడ్ చేశారని అంచనా. వీటిలో మీరు ఏ ఒక్క యాప్ ఉపయోగిస్తున్నా వెంటనే డిలిట్ చేయండి. ప్రముఖ కంపెనీకి చెందిన యాంటీవైరస్ యాప్ ఉపయోగించండి. యాంటీ వైరస్ యాప్‌తో నిత్యం యాప్స్‌ని స్కాన్ చేస్తూ ఉండండి. ఇకపై యాప్స్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా డెవలపర్ పేరు చెక్ చేయండి.

Amazon Prime Free Subscription: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

ఇటీవల కాలంలో జోకర్ మాల్‌వేర్ చాలా యాప్స్‌లో బయటపడుతుంది. ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటాను సేకరిస్తూ ఉంటుంది. యూజర్ల కాంటాక్ట్స్, డివైజ్ డేటా, ఎస్ఎంఎస్ లాంటి వివరాలన్నీ సేకరిస్తుంది. ఇంకొన్ని మాల్‌వేర్ యాప్స్ యూజర్ల ప్రమేయం లేకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్‌ చేస్తుంది. దీని వల్ల యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతుంటాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

తదుపరి వార్తలు