• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ALERT FOR SMARTPHONE USERS IMMEDIATELY DELETE THESE 47 APPS TO AVOID ADWARE ATTACK SS

Apps: మీ ఫోన్‌లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి

Apps: మీ ఫోన్‌లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి

Apps: మీ ఫోన్‌లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Adware Apps | సమాచారం అందుకున్న వెంటనే వాటిని డిలిట్ చేసింది గూగుల్. అయితే ఇప్పటికే 30 లక్షల సార్లు ఈ యాప్స్‌‌ని డౌన్‌లోడ్ చేసినట్టు తేలింది.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నకిలీ యాప్స్, మాల్‌వేర్‌తో ఉన్న యాప్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి యాప్స్ గురించి వరుసగా వార్తలు రావడం యూజర్లలో ఆందోళనకు కారణమవుతోంది. ఈ డేంజర్ యాప్స్‌ని గూగుల్ ప్లేస్టోర్ ఎప్పటికప్పుడు గుర్తించి తొలగిస్తూనే ఉంది. కానీ... ఇప్పటికే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి మాత్రం ముప్పు తప్పట్లేదు. అందుకే మాల్‌వేర్ యాప్స్ గురించి సైబర్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. గూగుల్ కూడా మొబైల్ సెక్యూరిటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఇలాంటి డేంజర్ యాప్స్‌ని గుర్తించే పనిలో పడింది. గూగుల్‌తో కలిసి పనిచేస్తున్న ట్రెండ్ మైక్రో సంస్థ గేమ్స్, కెమెరాలకు సంబంధించిన కొన్ని డేంజర్ యాప్స్‌ని గుర్తించింది. ఈ యాప్స్ యాడ్వేర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను టార్గెట్ చేస్తున్నాయని బయటపడింది. మీ ఫోన్‌లో దాక్కునే యాడ్‌వేర్ ఫుల్ స్క్రీమ్ అడ్వర్టైజ్‌మెంట్లతో చికాకు పుట్టిస్తాయి. 47 యాప్స్‌ని గుర్తించి గూగుల్ ప్లేస్టోర్‌కు సమాచారం ఇచ్చింది ట్రెండ్ మైక్రో. సమాచారం అందుకున్న వెంటనే వాటిని డిలిట్ చేసింది గూగుల్. అయితే ఇప్పటికే 30 లక్షల సార్లు ఈ యాప్స్‌‌ని డౌన్‌లోడ్ చేసినట్టు తేలింది. వారంతా యాప్‌ని డిలిట్ చేయకపోతే సమస్యలు తప్పవు. మరి ఆ 47 యాప్స్ ఏవో తెలుసుకోండి.

    1. Balls Escape
    2. Balls Out Puzzle
    3. Beautiful House Paint
    4. Blur Image Photo
    5. Bubble Effect
    6. Bullet Master
    7. Cat Real Haircuts
    8. Clown Mask
    9. Color Splash Photo Effect
    10. Cut Perfectly
    11. Dynamic Background
    12. Flow Points
    13. Funny Fake
    14. Galaxy Overlay Blender
    15. Ghost Prank
    16. House Drawing Color Paint
    17. House Painting
    18. Love Pair
    19. Love test 2019
    20. Magazine Cover Maker
    21. Magazine Cover Studio
    22. Magazine Photo Editor
    23. Magic Pencil Sketch Effect
    24. Magic Super power: Movies Special Effects
    25. Magic Video Editing
    26. Master Screen Recorder
    27. Motorcycle Bike Race
    28. Music Video Maker
    29. Musical Balls
    30. Musical Rolling Road
    31. Neon Light Photo Editor-Magic Effect
    32. Photo Blender
    33. Photo Overlays
    34. Photo Smoke Effect
    35. Pixel Effect: Photo Editor & Overlay Art
    36. Reverse Video Editing
    37. Ruling the difference
    38. Running Dinosaur
    39. Shoot it
    40. Skull Face: Photo & Camera Effects
    41. Slice Master
    42. Smoke Effect
    43. Smoke Effect Art
    44. Tattoo Editor: Photo & Camera Effects
    45. Tattoo Maker
    46. Trippy Effects:Photo & Camera Filters
    47. True love Calculator

    మరి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్క యాప్ ఉన్నా డిలిట్ చేయడం మంచిది. లేకపోతే యాడ్‌వేర్ మీకు చికాకు కలిగించడం ఖాయం.

    Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే



    ఇవి కూడా చదవండి:

    WhatsApp: యూజర్లను బ్యాన్ చేస్తున్న వాట్సప్... ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి

    Samsung Smartphone: రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.3,000 వరకు తగ్గింపు

    WhatsApp: వాట్సప్‌తో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతోందా? నిజమిదే
    Published by:Santhosh Kumar S
    First published: