Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడితే కొమ్ములు వస్తున్నాయి... ఇదిగో సాక్ష్యం

Smartphone | స్మార్ట్‌ఫోన్ వాడేప్పుడు తలను ముందుకు వంచడం వల్ల వెన్నుపై ఉండే బరువు తల వెనుక ఉండే కండరాలపై పడుతుంది. ఫలితంగా అక్కడ ఎముక పెరుగుతోంది.

news18-telugu
Updated: June 21, 2019, 2:43 PM IST
Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడితే కొమ్ములు వస్తున్నాయి... ఇదిగో సాక్ష్యం
Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడితే కొమ్ములు వస్తున్నాయి... ఇదిగో సాక్ష్యం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్... సాంకేతిక విప్లపం. మనిషి జీవితంలో భాగమైపోయిన గ్యాడ్జెట్. నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. ఒక్క రోజు కాదు కదా... కొన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్ లేని జీవితం ఊహించలేం. ఈ గ్యాడ్జెట్‌కు అంతలా బానిసైపోయారు జనం. మనిషి అన్ని అవసరాలను తీరుస్తున్న గ్యాడ్జెట్‌తో అంతా మేలే జరుగుతుంది అనుకుంటే పొరపాటే. మేలు ఎంత ఉందో కీడు కూడా అంతే ఉంది. నిద్రలేమి, మానసిక సమస్యలతో పాటు మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది స్మార్ట్‌ఫోన్. ఇవన్నీ అందరికీ తెలిసిన సమస్యలే. ఇప్పుడు తాజాగా ఓ పరిశోధన పెద్ద బాంబే పేల్చింది. మనిషి మెదడుపై మాత్రమే కాదు... పుర్రెపైనా స్మార్ట్‌ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉందని తేల్చిన పరిశోధన అది. స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్న యువత పుర్రెలో కొమ్ములు వస్తున్నాయని తేలింది. ఈ ఎక్స్‌రే చూడండి.

smartphone, smartphone health disorder, smartphone health problems, Growing Horns on skull, Growing Horns on head, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్ సమస్యలు, స్మార్ట్‌ఫోన్ హెల్త్ డిజార్డర్, స్మార్ట్‌ఫోన్ ఆరోగ్య సమస్యలు, స్మార్ట్‌ఫోన్ పుర్రెపై కొమ్ములు

స్మార్ట్‌ఫోన్ వాడేప్పుడు తలను ముందుకు వంచడం వల్ల వెన్నుపై ఉండే బరువు తల వెనుక ఉండే కండరాలపై పడుతుంది. ఫలితంగా అక్కడ ఎముక పెరుగుతోంది. సరిగ్గా మెడకు పైభాగంలో పుర్రెలో పెరుగుతున్న ఎముక చూడటానికి కొమ్ములా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సన్‌‌షైన్ కోస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయన ఫలితాలను అకడమిక్ పేపర్స్‌లో వెల్లడించారు. చిన్న స్క్రీన్స్‌ని చూసేందుకు తలను ముందుకు వంచాల్సి వస్తోందని, స్మార్ట్‌ఫోన్‌తో పాటు చేతిలో పట్టుకునే డివైజ్‌లు మనిషి ఆకారాన్ని మార్చేస్తున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ జీవితంలో ఉపయోగించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మనిషి శరీరంపై, అస్థిపంజరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు తాము జరిపిన తొలి పరిశోధన ఇది అని వెల్లడించారు పరిశోధకులు.

ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ కారణంగా టెక్స్ట్‌ నెక్, టెక్స్టింగ్ థంబ్, కంప్యూటర్ కారణంగా కార్పల్ టన్నెల్ సిండ్రోల్ లాంటి సమస్యలున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఏకంగా కొమ్ములు మొలుస్తున్న కొత్త సమస్య బయటపడటం మరో హెచ్చరికే. ఈ సమస్యను ఆస్ట్రేలియా మీడియా హెడ్ హార్న్స్, ఫోన్ బోన్స్, స్పైక్స్, వీర్డ్ బంప్స్ అనే పేర్లతో పిలుస్తోంది. పేరు ఏదైనా పెరుగుతున్న టెక్నాలజీ మనిషిపై ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో బయటపెట్టే పరిశోధన ఇది.



Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు

Credit Card: మీరు వాడని క్రెడిట్ కార్డును ఇలా క్యాన్సిల్ చేయొచ్చు

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు