Smartphone: ఈ వాల్‌పేపర్ వాడితే ఫోన్ పాడవడం ఖాయం... ఇదిగో సాక్ష్యం

Smartphone | మీకు తరచూ స్మార్ట్‌ఫోన్ వాల్ పేపర్ మార్చే అలవాటు ఉందా? ఈ వాల్ పేపర్ వాడకండి. మీ ఫోన్ పాడయ్యే అవకాశముంది.

news18-telugu
Updated: June 2, 2020, 9:41 AM IST
Smartphone: ఈ వాల్‌పేపర్ వాడితే ఫోన్ పాడవడం ఖాయం... ఇదిగో సాక్ష్యం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. మీరు తరచూ మీ ఫోన్ వాల్ పేపర్స్ మారుస్తున్నారా? ఫోన్ లుక్ కొత్తగా ఉండటానికి కొత్తకొత్త వాల్ పేపర్స్ ట్రై చేస్తున్నారా? మీరు ఎన్ని వాల్ పేపర్స్ మార్చినా సరే పొరపాటున కూడా ఈ వాల్ పేపర్ వాడకండి. ఈ వాల్ పేపర్ వాడినట్టైతే మీ ఫోన్ పాడైపోవడం ఖాయం. అదేంటీ... వాల్ పేపర్ వాడితే ఫోన్ పాడైపోతుందా అని డౌటా? ఖచ్చితంగా పాడైపోతుంది. ఆ వాల్ పేపర్‌లో ఉన్న బగ్ మీ ఫోన్‌ని, మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం. ఇదేదో నమ్మశక్యంగా లేదనుకుంటున్నారా? చాలామంది నమ్మలేదు. ఏమవుతుందిలే అని ఆ వాల్ పేపర్ ట్రై చేశారు. అంతే... క్షణాల్లో ఫోన్ ఆఫ్ అయిపోయింది. మళ్లీ ఆన్ కావడానికి తిప్పలు పడాల్సి వచ్చింది. కొందరైతే ఫోన్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌తో ఆన్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నమ్మాలని లేదా? అయితే ఈ కింద వీడియో చూడండి.


ద్వీపం చుట్టూ సరస్సు, సూర్యాస్తమయంతో వాల్‌పేపర్ చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది ఈ వాల్ పేపర్‌ను తమ స్క్రీన్ పైన ట్రై చేశారు. అంతే ఫోన్ పాడైపోయింది. మళ్లీ ఆ ఫైల్ డిలిట్ చేస్తేనో, లేదా ఫోన్ రీబూట్ చేస్తేనో ఫోన్ స్టార్టైంది. అందుకే నెటిజన్లు చాలామంది ఎట్టిపరిస్థితుల్లో మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ వాల్ పేపర్ ట్రై చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఈ వాల్ పేపర్ వాడొద్దని సూచిస్తున్నారు. ఈ విషయం సాంసంగ్ దృష్టికి ఎప్పుడో వెళ్లింది. ఈ సమస్యను పరిష్కరించింది కూడా. దీనికి సంబంధించిన అప్‌డేట్ సాంసంగ్ యూజర్లకు రిలీజ్ చేస్తోంది. ఆ వాల్ పేపర్‌లో ఉన్న బగ్ కారణంగా ఈ సమస్య వస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:Current Bill: అలర్ట్... రేపటి నుంచి కరెంట్ బిల్లు లెక్కించేది ఇలాగే

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphone: రూ.12,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 2, 2020, 9:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading