ALERT FOR SMARTPHONE USERS DO NOT DO THESE 5 MISTAKES IN THIS SUMMER TO AVOID MOBILE BLAST SS
Smartphone Tips: సమ్మర్లో ఈ తప్పులు చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ పేలే అవకాశం
Smartphone Tips: సమ్మర్లో ఈ తప్పులు చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ పేలే అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)
Smartphone Tips | స్మార్ట్‌ఫోన్ యూజర్లు చేసే చిన్నచిన్న పొరపాట్లతో మొబైల్ పేలుతూ (Smartphone Blast) ఉంటుంది. సమ్మర్లో ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఉండాలంటే సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
స్మార్ట్ఫోన్లు పేలుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2), రియల్మీ ఎక్స్‌టీ, సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లు పేలడం కలకలం రేపింది. స్మార్ట్‌ఫోన్ పేలడానికి (Smartphone Blast) అనేక కారణాలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ వేడికావడం, బ్యాటరీ పాడవడం లాంటివి ప్రధాన కారణాలు. మొబైల్ వేడెక్కి బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు పేలితే యూజర్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది. ఇలాంటి ప్రమాదాలు వేసవిలో ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి యూజర్లు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మరి ఆ జాగ్రత్తలేంటీ? స్మార్ట్‌ఫోన్ పేలకుండా మీరేం టిప్స్ పాటించాలి? తెలుసుకోండి.
Sunlight: మీరు ఎక్కువగా బయట తిరుగుతుంటారా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌కు ఎండ తగలకుండా జాగ్రత్తపడండి. ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ టెంపరేచర్ ఒకలా ఉంటుంది. అదే బయటకు వెళ్తే టెంపరేచర్ పెరుగుతుంది. ఎండలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే ఇంకా వేడి ఎక్కువవుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ వేడికాకుండా జాగ్రత్తపడండి.
Charger: ఛార్జర్ పాడైందని మార్కెట్లో ఏదో ఓ ఛార్జర్ కొంటున్నారా? అయితే జాగ్రత్త. మార్కెట్లో లభించే థర్డ్ పార్టీ ఛార్జర్లు, ఆర్డినరీ ఛార్జర్లతో మీ స్మార్ట్‌ఫోన్ పేలే అవకాశం ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ బాక్సులో వచ్చిన ఛార్జర్‌నే ఉపయోగించండి. ఆ ఛార్జర్ పాడైతే అదే కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్ కొనండి.
Damaged Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ డ్యామేజ్ అయిందా? కొత్త ఫోన్ తర్వాత కొందాంలే అని డ్యామేజ్ అయిన మొబైల్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. డ్యామేజ్ అయిన స్మార్ట్‌ఫోన్ పేలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆ స్మార్ట్‌ఫోన్ చెక్ చేయించండి. వీలైతే బాగు చేయించి వాడుకోండి.
Overcharge: మీ స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఛార్జ్ చేస్తున్నారా? అది కూడా ప్రమాదమే. రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం, గంటలు గంటలు ఛార్జింగ్ చేయడం కూడా రిస్కే. బ్యాటరీ 100 శాతానికి చేరుకోగానే ఛార్జింగ్ ఆఫ్ చేయండి. చాలావరకు స్మార్ట్ఫోన్లలో ఉన్న ఫీచర్ ఆటోమెటిక్‌గా పవర్ సప్లై కాకుండా ఆపేస్తుంది. ఆ ఫీచర్ ఉన్నా లేకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి.
ఇవే కాదు... మరిన్ని టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌కు మంచిది. అవసరం లేకపోతే లొకేషన్ సర్వీసెస్, బ్లూటూత్ సర్వీసెస్ ఆఫ్ చేయండి. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌పై లోడ్ తగ్గుతుంది. ఈ రెండూ ఆపెయ్యడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. స్క్రీన్ బ్రైట్నెస్ కూడా తగ్గించండి. దీని వల్ల బ్యాటరీ తక్కువ ఖర్చవుతుంది. బ్యాటరీపై, ప్రాసెసర్‌పై లోడ్ తగ్గుతుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా యాప్స్ డౌన్లోడ్ చేశారా? అవసరం లేని యాప్స్ ఉంటే డిలిట్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి మీరు డౌన్లోడ్ చేసిన యాప్స్ లిస్ట్ ఓసారి చూడండి. మీరు ఉపయోగించని యాప్స్ ఉంటే సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌పై లోడ్ తగ్గడం మాత్రమే కాకుండా స్పేస్ కూడా ఆదా అవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.