ALERT FOR SMARTPHONE USERS DELETE THESE 23 DANGEROUS APPS IMMEDIATELY SS
Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి
Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Dangerous Apps | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. ప్రమాదకరమైన 23 యాప్స్ జాబితా విడుదల చేసింది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. ఆ యాప్స్ మీరూ వాడుతున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి.
మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అందులో రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే అలర్ట్. ప్లేస్టోర్‌లో పనికొచ్చే యాప్స్‌తో పాటు డేంజరస్ యాప్స్ కూడా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేస్తే మీకు ముప్పే. మీ కీలకమైన సమాచారంతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా దోచేస్తాయి. ఇలాంటి యాప్స్ జాబితా తరచూ బయటపడుతూ ఉంటుంది. అనేక సెక్యూరిటీ సంస్థలు వాటిని డిలిట్ చేయాలని సూచిస్తుంటాయి. ఇప్పుడు మళ్లీ సోఫోస్ రీసెర్చర్స్ 23 డేంజరస్ యాప్స్ జాబితాను రిలీజ్ చేయడం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఈ యాప్స్‌లో fleeceware పేరుతో వైరస్ ఉంది. ఈ 23 యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ కొత్త యాప్ పాలసీలను ఉల్లంఘిస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. యూజర్ల ప్రమేయం లేకుండా ఈ యాప్స్‌కు సబ్‌స్క్రైబ్ చేస్తోందని గుర్తించారు. మొదట ఉచితంగానే ట్రై చేయండని ఎరవేసి ఆ తర్వాత యూజర్లకు తెలియకుండా బిల్ వసూలు చేస్తున్నట్టు బయటపడింది. మీరు ఇలాంటి యాప్స్ వాడుతున్నట్టైతే వెంటనే డిలిట్ చేయడం మంచిది. ఆ 23 యాప్స్ ఈ పేర్లతో ఉంటాయి.