Fake Google Chrome: 'గూగుల్ క్రోమ్' పేరుతో నకిలీ యాప్... వెంటనే డిలిట్ చేయండి

Fake Google Chrome: 'గూగుల్ క్రోమ్' పేరుతో నకిలీ యాప్... వెంటనే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Fake Google Chrome App | మీరు ఇటీవల ప్లే స్టోర్ నుంచి గూగుల్ క్రోమ్ యాప్ డౌన్‌లోడ్ చేశారా? అయితే అది నకిలిదీ ఏమో ఓసారి చెక్ చేయండి. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్‌ను గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు.

  • Share this:
సైబర్‌ నేరాలు చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు హ్యాకర్లు. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా గూగుల్‌ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాలకు వాడుకుంటున్నారు. స్మిషింగ్‌ ట్రోజాన్‌ అనే మాల్‌ వేర్‌ను ఫోన్‌లోకి పంపించి... మొబైల్‌నే ఏకంగా మాల్‌వేర్‌ సూపర్‌ స్ప్రెడర్‌గా మార్చేస్తున్నారని సైబర్ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫేక్‌ గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ గురించి టెక్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ ఫర్మ్‌ ప్రెడో ఈ ఫేక్‌ గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ విషయాన్ని గుర్తించింది. మెసేజ్‌ల ద్వారా స్పామ్‌, ఫిషింగ్‌ లింక్‌లను పంపించి మొబైల్స్‌ను హ్యాక్‌ చేయడం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫేక్‌ గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ను కొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు.

మీకు విదేశాల నుంచి ఏదో పార్సిల్‌ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్‌ పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేస్తే మీ క్రోమ్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌ చేసుకోండి అని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే కొడితే బ్రౌజర్‌ కొత్త వెర్షన్‌ అంటూ ఓ యాప్‌ వచ్చి మొబైల్‌లో చేరుతుంది. అందులో పేమెంట్‌ చేస్తే... ఆ వివరాలు హ్యాకర్ల చేతికి చేరిపోతాయి. ఇంకేముంది ఆ బ్యాంకు ఖాతాలో డబ్బు మొత్తాన్ని హ్యాకర్లు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. దీన్నే స్మిషింగ్‌ ట్రోజాన్‌ అంటున్నారు.

Mi 11x Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

డబ్బులు పోవడం ఒక్కటే కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా జరుగుతోంది. అదే సూపర్‌ స్ప్రెడర్‌. మీ మొబైల్‌ను హ్యాక్‌ చేసి కార్డు/బ్యాంకు ఆన్‌లైన్‌ వివరాలు కొట్టేసి డబ్బులు తీసుకోవడంతోపాటు, మీ మొబైల్‌లోని మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌, కాల్‌ హిస్టరీ వివరాలు కూడా ఈ ట్రోజాన్‌ తీసుకుంటోంది. దాంతో మీ మొబైల్‌ నుండి రోజూ రెండు, మూడు గంటల వ్యవధిలో మీ కాంటాక్ట్స్‌కు ఆ ట్రోజాన్‌ స్పామ్‌ మెసేజ్‌ వెళ్తుంది. అయితే ఫేక్‌ యాప్‌, ఒరిజినల్‌ యాప్‌ ఒకేలా ఉండటంతో గుర్తుపట్టడం కష్టమే. యాప్‌ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి గుర్తుపట్టొచ్చు.

Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

మొబైల్‌లోని యాంటీ వైరస్‌లు సైతం దీన్ని గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ ఫేక్‌ గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ను సిద్ధం చేశారు. అందుకే ఈ ఇబ్బంది రాకూడదు అంటే... ఇలాంటి లింక్స్‌ను నమ్మకపోవడం ఒకటే మార్గం అంటున్నారు పరిశీలకులు. దాంతోపాటు ఏదైనా యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలన్నా, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నా ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచే చేయాలని సూచిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: