Home /News /technology /

ALERT FOR SMARTPHONE USERS BANNED CHINA APPS SILENTLY ENTERING TO INDIA AGAIN SS GH

China Apps: అలర్ట్... మళ్లీ ఇండియాలోకి సైలెంట్‌గా ప్రవేశిస్తున్న చైనా యాప్స్

China Apps: అలర్ట్... మళ్లీ ఇండియాలోకి సైలెంట్‌గా ప్రవేశిస్తున్న చైనా యాప్స్
(ప్రతీకాత్మక చిత్రం)

China Apps: అలర్ట్... మళ్లీ ఇండియాలోకి సైలెంట్‌గా ప్రవేశిస్తున్న చైనా యాప్స్ (ప్రతీకాత్మక చిత్రం)

China Apps | చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం (China Apps Ban) విధించినా కొన్ని యాప్స్ మళ్లీ ఇండియాలోకి సైలెంట్‌గా ఎంటర్ అవుతున్నాయి.

భారత కేంద్ర ప్రభుత్వం గతేడాదిలో 267 చైనా యాప్‌లపై నిషేధం (China Apps Ban) విధించిన సంగతి తెలిసిందే. భారత పౌరుల సమాచార భద్రత, గోప్యతతో సహా దేశసౌర్వభౌమత్వానికి భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే చైనా యాప్‌లను (Chinese Apps) కేంద్రం నిషేధించినప్పటికీ.. చైనా తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. చైనా గుట్టుచప్పుడు కాకుండా తమ దేశ యాప్‌లను ఇండియాలో ప్రవేశపెడుతూనే ఉంది. కేవలం యాప్ పేర్లను మార్చేసి కొత్త కంపెనీల పేర్లతో వాటిని రన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాన్ విధించిన తర్వాత కూడా దేశంలో చైనా యాప్‌లు పెరిగిపోతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

అలీబాబా, బైట్ డాన్స్, షియోమి తదితర కంపెనీల యాప్‌లను కేంద్రం ఇప్పటికే బ్యాన్ చేసింది. అయితే నక్కజిత్తుల బుద్ధితో చాలా కంపెనీలు తమ చైనా మూలాలను దాచిపెడుతున్నాయి. నూతన కంపెనీ పేర్లతో తమ యాప్‌లను ఇండియన్ యాప్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అప్లికేషన్ల ఓనర్ షిప్ డేటా పబ్లిక్ లో అందుబాటులో లేని కారణంగా ఈ అప్లికేషన్లు సులభంగా ఇండియాలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే నేడు ఇండియాలో టాప్ 60 యాప్‌లలో కనీసం 8 యాప్‌లు చైనా దేశానికి సంబంధించినవేనని తెలుస్తోంది. ప్రతి నెలా 211 మిలియన్ల యూజర్లను పెంచుకోవాలనేది ఈ అప్లికేషన్ల లక్ష్యమని సమాచారం. గతేడాది జూలైలో కేంద్రం నిషేధించిన చైనా యాప్‌లు ఇప్పుడు 96 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. గత 13 నెలల్లో చైనీస్ యాప్ లలో 115 మిలియన్ల కొత్త యూజర్లు చేరినట్టు తెలుస్తోంది.

Redmi Note 10 Pro Max: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే కొనండి

దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 2020లో భారత్ లో 267 చైనీస్ యాప్‌లపై ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద కఠిన నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది కేంద్రం. గతేడాదిలో ఇండియా, చైనా మధ్య సరిహద్దు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్, పబ్‌జీ, హెలో, అలీఎక్ష్ప్రెస్స్, లైకీ, షేర్ఇట్, ఎంఐకమ్యూనిటీ, వీచాట్ క్యాంస్కానర్, బైడు సెర్చ్, వెయిబో, బిగో లైవ్ యాప్‌లను బ్యాన్ చేసింది. దాంతో చైనా వేల కోట్ల రూపాయల నష్టంతో తల్లడిల్లింది.

Free Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్... ఆఫర్ రేపటి వరకే

గతంలో భారత డేటా, పౌరుల భద్రతకు ఎలాంటి హాని కలగకూడదంటే కొన్ని చైనీస్ యాప్‌లను బ్యాన్ చేయాలని హోంమంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి అందిన నివేదికలను పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వశాఖ యాప్‌ల యాక్సెస్‌ను బ్యాన్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పౌరుల భద్రతను, సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం వెంటనే చైనీస్ అప్లికేషన్లను బ్యాన్ చేసింది.

Realme GT Master Edition: రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్

నిషేధం తర్వాత కూడా రన్ అవుతున్న యాప్‌లు


కేంద్రం నిషేధం విధించినప్పటికీ మళ్లీ ముసుగులో ప్రవేశిస్తున్న చైనా యాప్‌లను గుర్తించలేకపోతోంది. ఇందుకు కారణం ఇండియాలో చాలా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ కంపెనీలలోనే ఉంటున్న ఈ చైనా కంపెనీలు తమ మూలాలను దాచి పెడుతున్నాయి. తెలివిగా పబ్లిక్ డేటా ఇన్ఫర్మేషన్ దాచి న్యూ కంపెనీ నేమ్స్ తో తమ యాప్‌లను లిస్టు చేస్తున్నాయి. వీటిలో చాలా వరకు యాప్‌లు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందినవే కాగా... వాటిలో టిక్‌టాక్ (Bytedance), స్నాక్ వీడియో (Kuaishou) సంస్థలు కూడా ఉన్నాయి.

ఇలాంటి యాప్‌లతో ఎక్కువ మంది వినియోగదారులకు చేరువకావచ్చని చైనీస్ కంపెనీలు భావిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాన్ విధించిన తరువాత ఇండియాలో బాగా యూజర్లను పెంచుకుంటున్న చైనీస్ యాప్‌ PLAYit. ఇందులో అన్ని ఓటీటీల ప్లాట్‌ఫాంలలోని కంటెంట్‌కు పైరసీ కాపీలు దొరుకుతాయి. ఇక టిక్‌టాక్, స్నాక్ వీడియో కంపెనీలను ఎప్పుడో బ్యాన్ చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ముసుగులో మన దేశంలో పనిచేస్తూనే ఉన్నాయి. నిషేధం విధించిన తర్వాత కూడా కొన్ని యాప్‌లు నెలల వ్యవధిలోనే మిలియన్ల యూజర్లను పెంచుకున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: China App Ban, Mobile App

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు