ఆన్లైన్లో అనేక మోసాలు (Online Cheatings) జరుగుతుంటాయి. నెటిజన్లకు ఓ స్కామ్ నుంచి అప్రమత్తం కాగానే మరో స్కామ్ పుట్టుకొస్తూ ఉంటుంది. నెటిజన్లు, స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిత్యం మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మరో పోర్న్ స్కామ్ కలకలం రేపుతోంది. వాస్తవానికి ఇది పాత స్కామే. కానీ ఇటీవల మళ్లీ ఈ స్కామ్‌లో నెటిజన్లు బుక్కైపోతున్నారు. సైబర్ నేరగాళ్లు (Cyber Frauds) అడిగినంతా చెల్లించి సైలెంట్ అయిపోతున్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు చాలా బయటపడుతున్నాయి. పోర్న్ చూస్తుండగా సడెన్‌గా బ్రౌజర్ బ్లాక్ కావడం, డబ్బులు చెల్లించాలని అందులో మెసేజ్ ఉండటం, డబ్బులు చెల్లించిన తర్వాత బ్రౌజర్ అన్‌బ్లాక్ కావడం... ఇదీ జరుగుతున్న మోసం. ఈ మోసాలపై సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు అప్రమత్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఒక యూజర్ కంప్యూటర్లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు నమ్మిస్తారు. "భారతదేశ చట్టం ద్వారా నిషేధించబడిన వాటిని వీక్షించడం, వ్యాప్తి చేయడం" చట్ట విరుద్ధమని మెసేజ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ లాక్ అయిందని, అన్‌లాక్ చేయాలంటే రూ.29,000 చెల్లించాలని ఉంటుంది. ఆరు గంటల్లో జరిమానా చెల్లించాలని, లేకపోతే కంప్యూటర్ను నేర విచారణ కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తామని మెసేజ్ ఉంటుంది.
Micromax In Note 2: ఐఫోన్ 13 డిజైన్‌తో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.12,490 మాత్రమే
Beware of such scams where #hackers may ask you for money on the behalf of the #Ministry_of_Law_and_Justice. While browsing some websites you may get a #FullScreen Popup window and it will tell you that your PC has been locked by Ministry. Don't Pay. Check Pics... #infoSec pic.twitter.com/f2op9TmylP
— Rajshekhar Rajaharia (@rajaharia) January 24, 2022
ఈ మెసేజ్‌తో పాటు పేమెంట్ సెక్షన్ కూడా ఉంటుంది. వీసా లేదా మాస్టర్‌కార్డ్‌తో డబ్బులు చెల్లించే ఆప్షన్స్ ఉంటాయి. ఈ మెసేజ్ నమ్మారంటే అడ్డంగా బుక్కవ్వాల్సిందే. ఇది పెద్ద మోసం. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ పేరు చెప్పుకొని సైబర్ నేరగాళ్లు నెటిజన్లను దోచేస్తున్నారు. భారతదేశంలో పోర్న్పైనిషేధం ఉన్న మాట వాస్తవమే. కానీ ప్రభుత్వం ప్రజల కంప్యూటర్లను ట్రాక్ చేయదని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో గతంలో ఇలాంటి మోసాలు కూడా జరిగాయి. గతేడాది జూలైలో స్కామర్లు ఇలాగే రూ.3,000 చొప్పున దోచేశారు.
Samsung Galaxy A52s: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,000 తగ్గింది
ఈ మోసం నుంచి బయటపడటానికి ఉన్న మార్గం పోర్న్ చూడకపోవడమే. అయితే పోర్న్ చూస్తున్నప్పుడే కాదు... ఇతర సందర్భాల్లో ఇలాంటి పాప్ అప్ మెసేజ్ వచ్చి, బ్రౌజర్ బ్లాక్ అయినట్టైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా బయటపడొచ్చు. మీ కంప్యూటర్లో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయండి. ctrl+alt+delete క్లిక్ చేసిన తర్వాత కూడా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత బ్రౌజర్ సెలెక్ట్ చేసి End Task పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్రౌజర్ మామూలుగా ఓపెన్ చేయొచ్చు. ఇలా చేసినా బ్రౌజర్ ఓపెన్ కాకపోతే కంప్యూటర్ షట్ డౌన్ చేసి కాసేపయ్యాక స్టార్ట్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber Attack, CYBER FRAUD, Porn ban, Porn Movies