Home /News /technology /

ALERT FOR NETFLIX DISNEY PLUS HOTSTAR AND AMAZON PRIME ACCOUNT HOLDERS NEW CREDIT CARD AND DEBIT CARD RULES WILL COME INTO EFFECT FROM OCTOBER SS GH

OTT Subscriptions: హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

OTT Subscriptions: హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)

OTT Subscriptions: హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

OTT Subscriptions | అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ (OTT Subscriptions) ఉన్నవారికి అలర్ట్. అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్‌తో (New Rules) మీకు మేలు జరగనుంది. అవేంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
ప్రతినెలా చేసే ఆన్‌లైన్ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ద్వారా రికరింగ్ ట్రాన్సాక్షన్లు, నెలవారీ చెల్లింపులకు (Monthly Bill Payments) మరింత భద్రత కల్పించాలని ఆర్బీఐ నిర్ణయించింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లేదా ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చేసే లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అక్టోబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో ఈ ప్రభావం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ అకౌంట్ల ఆటోమెటిక్ రెన్యువల్ ఆప్షన్లపై పడనుంది.

కొన్ని రకాల నెలవారీ బిల్లులను ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా చెల్లించే అవకాశం ఉంటుంది. యుటిలిటీ బిల్లులు, మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల చెల్లింపులను ఇలా చేస్తుంటారు. అయితే నెలవారీ ఆటోమేటెడ్ పేమెంట్స్ చేసే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాం యూజర్లు.. కొత్త నిబంధనల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. యూజర్లు ఇలాంటి అకౌంట్లను ఉపయోగించేందుకు కార్డు లేదా అకౌంట్ల వివరాలను మళ్లీ అందించాల్సి ఉంటుంది.

Yono SBI App: ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని యోనో లైట్ యాప్‌లో పొందండి ఇలా

కొత్తగా ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయి?


ఎడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ద్వారా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు అదనపు భద్రత, రక్షణ లభిస్తుందని ఆర్బీఐ చెబుతోంది. దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం.. ట్రాన్సాక్షన్ కోసం డబ్బు డెబిట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందుగానే బ్యాంకులు తమ ఖాతాదారులకు రికరింగ్ పేమెంట్స్ గురించి తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్‌ను SMS లేదా ఈ-మెయిల్ ద్వారా పంపిస్తాయి. అథెంటికేషన్, వెరిఫికేషన్‌లో అదనపు ప్రొసీడింగ్స్ అన్నీ మొదటిసారి మాత్రమే తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది. ఆ తర్వాత తదుపరి చెల్లింపులకు సుదీర్ఘ ప్రక్రియ ఉండదు.

LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి

కస్టమర్ కార్డ్ నుంచి ఆటో-డెబిటింగ్ లిమిట్ రూ. 5,000 మాత్రమే ఉంటుంది. ఈ పరిమితిని దాటి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే.. దాన్ని ధ్రువీకరించడానికి OTPని ప్రతిసారీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు రికరింగ్ పేమెంట్ ఆప్షన్‌ను నిలిపివేయాలనుకుంటే.. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆప్షన్‌ను ఆపేయవచ్చు. ఇందుకు బ్యాంకు ఆన్‌లైన్ సదుపాయాన్ని అందించాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon prime, Credit cards, Disney+ Hotstar, Hotstar, Netflix, Reserve Bank of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు