హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Ads: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అలర్ట్.. ఎక్కువగా కనిపించనున్న యాడ్స్!

Instagram Ads: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అలర్ట్.. ఎక్కువగా కనిపించనున్న యాడ్స్!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Instagram Ads: మెటా కంపెనీ లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫార్మాట్లు, యాడ్ ప్లేస్‌మెంట్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. వీటి సహాయంతో ఆయా బిజినెస్‌లు ఎక్స్‌ప్లోర్ హోమ్‌లో కూడా యాడ్స్ రన్ చేసే అవకాశాన్ని పొందుతాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం మెటా (Meta) తన యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రెవెన్యూ పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్లు ఫీడ్‌లలో మరిన్ని యాడ్స్ డిస్‌ప్లే చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఎక్స్‌ప్లోర్ హోమ్ పేజీలో, ప్రొఫైల్ ఫీడ్స్‌లో యాడ్స్ (Ads) రన్ చేసేలా అడ్వర్టైజర్స్‌కు వీలు కల్పించనుంది. దీనివల్ల త్వరలో యూజర్లు తమ ఫీడ్‌లో, హోమ్ పేజీలో యాడ్స్ ఎక్కువగా చూడాల్సి వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని యూజర్లతో బెటర్‌గా కనెక్ట్ అయ్యేలా అడ్వర్టైజర్ల కోసం ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు మెటా తాజాగా తెలిపింది.

* ప్రారంభమైన యాడ్స్‌ టెస్టింగ్‌

ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రొఫైల్ ఫీడ్‌ (Profile Feed)లో యాడ్స్ టెస్ట్ చేయడం కూడా ప్రారంభించినట్లు మెటా వెల్లడించింది. ఇతర యూజర్ల అకౌంట్ ప్రొఫైల్‌ను విజిట్ చేశాక వారి పోస్ట్స్‌లో ఒక పోస్ట్ పై క్లిక్ చేశాక.. అన్ని పోస్ట్స్ స్క్రోల్ చేసేందుకు వీలుగా ఫీడ్ కనిపిస్తుందనే విషయం తెలిసే ఉంటుంది. ఈ ఫీడ్‌లో యాడ్స్ చూపించే దిశగా మెటా ముందడుగులు వేస్తోంది. దీనివల్ల ప్రొఫైల్ ఫీడ్‌లో మునుపటి కంటే ఎక్కువ యాడ్స్ కనిపిస్తాయి.

ప్రొఫైల్ ఫీడ్‌లలో యాడ్స్ ప్రధానమైనవి. అయితే మానిటైజేషన్ అవకాశంతో ఒక ప్రయోగంగా మెటా దీనిని పరీక్షిస్తోంది. దీని వల్ల అర్హత ఉన్న క్రియేటర్స్ తమ ప్రొఫైల్ ఫీడ్‌లలో ప్లే అయ్యే యాడ్స్ నుంచి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ సంపాదించగలగుతారు. ఈ మానిటైజేషన్ ఆప్షన్ సెలెక్టెడ్ యూఎస్ క్రియేటర్స్‌కు అందుబాటులోకి తీసుకురావాలని మెట్ట చూస్తోంది. ఈ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

* AI ద్వారా కనిపించే యాడ్స్‌

మెటా కంపెనీ లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫార్మాట్లు, యాడ్ ప్లేస్‌మెంట్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. వీటి సహాయంతో ఆయా బిజినెస్‌లు ఎక్స్‌ప్లోర్ హోమ్‌లో కూడా యాడ్స్ రన్ చేసే అవకాశాన్ని పొందుతాయి. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌ అనేది హోమ్ పేజీ కింద మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ లాగా కనిపిస్తుంది. దీనిపై నొక్కగానే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంట్రెస్ట్స్‌కి తగినట్లుగా సరికొత్త వీడియోలు, ఫొటోలు, రీల్స్ ఒక గ్రిడ్ రూపంలో కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి : జీమెయిల్ ఎక్కడ లాగిన్ చేసినా సింపుల్‌గా ఇలా లాగౌట్ చేయండి

అయితే ఇకపై ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని గ్రిడ్‌లో యూజర్లకు మరిన్ని ప్రకటనలు కనిపిస్తాయి. ఇది ఎలా ఉంటుందనే దానిపై యూజర్లకు క్లారిటీ ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్ ఒక స్క్రీన్‌షాట్ కూడా అందించింది. ఈ స్క్రీన్‌షాట్‌లో ఎక్స్‌ప్లోర్ గ్రిడ్‌లో ఒక యాడ్ చాలా పెద్ద ప్లేస్‌లో కనిపించింది.

మెటా యూజర్లకు నచ్చే యాడ్స్ అందించడానికి AIని ఉపయోగిస్తుంది. “ఒక వ్యక్తి ఒక యాడ్‌తో ఎంగేజ్ అయినప్పుడు, మెషీన్ లెర్నింగ్ ద్వారా వారికి నచ్చే అలాంటి యాడ్స్ ఎక్కువగా అందిస్తాం" అని కంపెనీ తెలిపింది. మెటా యాడ్ సేల్స్ తగ్గుతున్న వేళ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ కొత్త యాడ్ డిస్‌ప్లేయింగ్ వేస్ ఉపయోగపడతాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, Meta, Tech news

ఉత్తమ కథలు