హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Account: జీమెయిల్ యూజర్లకు అలర్ట్... ఇక లాగిన్ చేయాలంటే ఈ రూల్ పాటించాల్సిందే

Google Account: జీమెయిల్ యూజర్లకు అలర్ట్... ఇక లాగిన్ చేయాలంటే ఈ రూల్ పాటించాల్సిందే

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Google Account | గూగుల్ అకౌంట్, జీమెయిల్ ఉన్నవారికి అలర్ట్. ఇకపై యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావడం సాధ్యం కాదు. తప్పనిసరిగా మరో సెక్యూరిటీ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి.

ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో జీమెయిల్, యాహూ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి పోటీపడేవారు. ఇప్పుడు యాహూ మెయిల్ పెద్దగా కనిపించట్లేదు కానీ... జీమెయిల్ అకౌంట్ ప్రతీ ఒక్కరికీ తపనిపసరి అయిపోయింది. జీమెయిల్ అకౌంట్ (Gmail Account) క్రియేట్ చేస్తే గూగుల్ ప్లాట్‌ఫామ్‌లోని ఇతర వెబ్‌సైట్స్, యాప్స్ లాగిన్ చేయడానికి జీమెయిల్ ఉంటే చాలు. సింపుల్‌గా లాగిన్ అయిపోవచ్చు. అయితే జీమెయిల్‌లో లాగిన్ (Gmail Login) చేసే విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది గూగుల్. జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్‌లో లాగిన్ చేయాలంటే ఇకపై 2-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ విషయాన్ని మేలో వాల్డ్ పాస్‌వర్డ్ డే రోజున ప్రకటించింది గూగుల్. నవంబర్ 9న ఈ రూల్ అమల్లోకి తీసుకొచ్చింది.

మీరు జీమెయిల్, గూగుల్ అకౌంట్ ఉపయోగిస్తున్నట్టైతే తప్పనిసరిగా 2-స్టెప్ వెరిఫికేషన్ చేయాల్సిందే. గతంలో 2-స్టెప్ వెరిఫికేషన్‌ను యూజర్లు సెట్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు 15 కోట్ల మంది గూగుల్ యూజర్లకు 2-స్టెప్ వెరిఫికేషన్ ఆటోమెటిక్‌గా ఎన్‌రోల్ అవుతుందని గూగుల్ ప్రకటించింది. జీమెయిల్‌తో పాటు గూగుల్ అకౌంట్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Bluetooth: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్... బ్లూటూత్ ఆన్ చేస్తే అంతే సంగతులు

గూగుల్ 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా పనిచేస్తుంది?


గూగుల్ 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా పనిచేస్తుందంటే నిన్నటివరకు జీమెయిల్‌లో లాగిన్ చేయడానికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే చాలు. కానీ ఇకపై మరో స్టెప్ కూడా ఉంటుంది. మీ ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ లేదా మీరు ముందే బ్యాకప్ చేసిన 8 అంకెల బ్యాకప్ డిజిట్ కోడ్ లేదా గూగుల్ ఆథెంటికేటర్‌లో వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో నోటిఫికేషన్ వస్తుంది. Yes పైన క్లిక్ చేయాలి. వీటిలో ఏదో ఒకటి చేస్తే తప్పని లాగిన్ కావడం సాధ్యం కాదు.

Smartphone Blast: ఆ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది... ఏ కంపెనీదో తెలుసా?

గూగుల్ 2-స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించి యూజర్లకు ఇమెయిల్స్ పంపింది గూగుల్. యూజర్లు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి గూగుల్ 2-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేయాలి. మరి మీ జీమెయిల్ అకౌంట్‌కు 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా సెట్ చేయాలో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

Step 1- ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయ్యేందుకు https://myaccount.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 3- ఎడమవైపు ఉన్న ఆప్షన్స్‌లో Security పైన క్లిక్ చేయాలి.

Step 4- Signing in to Google సెక్షన్‌లో 2-Step Verification ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- ఆ తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి.

First published:

Tags: GMAIL, Google, Google news, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు