Gmail: జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. డేంజరస్ స్కామ్ లో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ప్రతీకాత్మకచిత్రం (PC: Google)

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ యూజర్లను బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈసారి జీమెయిల్ వినియోగదారులను టార్గెట్ చేశారు.

  • Share this:
సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ యూజర్లను బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈసారి జీమెయిల్ వినియోగదారులను టార్గెట్ చేశారు. మీరు తరచూ జీమెయిల్ వాడుతున్న వారైతే.. ఇప్పుడే జాగ్రత్త పడండి! ప్రస్తుతం ఒక కొత్త ఈమెయిల్ స్కామ్ జీమెయిల్ యూజర్లను బాగా టార్గెట్ చేస్తోంది. ఈ డేంజరస్ స్కామ్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై కూడా కన్నేసింది. మీరు ఫేక్ లింక్‌లపై క్లిక్ చేయకపోయినా, మాల్వేర్‌ను డౌన్‌లోడ్ చెయ్యకపోయినా ఈ స్కామర్లు మిమ్మల్ని మోసం చేయగలుగుతారు. 'విషింగ్' అని పిలిచే ఈ కొత్త మెయిల్ స్కామ్ ద్వారా జీమెయిల్ యూజర్లు టార్గెట్ అవుతున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కైకు చెందిన ఓ బృందం జీమెయిల్ యూజర్ల ఇన్‌బాక్స్‌లలోకి స్కామ్ ఈమెయిల్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయని హెచ్చరించారు.

ఈ స్కామర్లు అమెజాన్, పేపాల్ వంటి పెద్ద పేరున్న బ్రాండ్‌ల పేర్లను ఉపయోగించుకుని ఈమెయిల్స్ పంపుతారు. యూజర్ తన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫలానా కంపెనీలో ఏదో ఒక ప్రొడక్ట్ కొన్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ స్కామర్లు యూజర్‌లను అత్యంత సులభంగా మోసం చేసేందుకు ఆయా పెద్ద కంపెనీలు ఉపయోగించే లొగో, ఫాంట్‌లను యూజ్ చేస్తారు. "మీరు పెద్ద మొత్తం డబ్బులు చెల్లించి.. ఒక కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ కొన్నారు. ఒకవేళ ఈ కొనుగోలు మీరు చేయకపోతే వెంటనే కాల్ చేయండి" అని చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడతారు.

ఇది చదవండి: ఫేస్‌బుక్‌లో ఎవరైనా వేధిస్తున్నారా? ఇలా బ్లాక్ చేయండి


వారు చెప్పిన నంబర్‌కి ఫోన్ చేస్తే.. ఒక వ్యక్తి అమెజాన్‌ లేదా పేపాల్ ప్రతినిధిలా కాల్ మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇలా యూజర్‌ తో మాట్లాడే వ్యక్తి ఒక డేంజరస్ హ్యాకర్‌.. కాగా యూజర్‌కు సంబంధించిన ఖాతా పేర్లు, పాస్‌వర్డ్‌ లు, బ్యాంక్ వివరాలతో సహా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు ఒక ఫేక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసేలా యూజర్లకు టోకరా వేస్తాడు. అలాగే యూజర్ పీసీ నుంచి సమాచారాన్ని దొంగలించేందుకు ట్రోజన్‌ను ఇన్‌స్టాల్ చేస్తాడు. ఈ స్కామర్లు యూజర్లను ఈజీగా ఏమార్చేందుకు చాలా తెలివిగా వ్యవహరిస్తారని.. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: బస్ టికెట్ల బుకింగ్ కు కొత్త యాప్... అభి బస్ తో ఏపీఎస్ ఆర్టీసీ బిగ్ డీల్...


కాస్పర్‌ స్కై సంస్థకు చెందిన ఒక ఉద్యోగి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ఈ స్కామ్ గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా పలు కంపెనీల నుంచి స్పామ్ ఈ-మెయిల్స్ అధిక సంఖ్యలో వస్తున్నట్లుగా తాము గుర్తించినట్లు తెలిపారు. గేమింగ్ ల్యాప్‌టాప్ లేదా యాపిల్ వాచ్ వంటి ఖరీదైన డివైజ్ ను అమెజాన్ ఖాతాలో పేపాల్ ద్వారా చెల్లించిన కొనుగోలు చేశారా? వంటి ప్రశ్నలు ఈ ఫ్రాడ్ ఈ-మెయిల్ లలో కనిపిస్తాయి. ఇటువంటి మెయిల్స్ కు స్పందించకుండా వాటిని వెంటనే డిలీట్ చేయాలని టేక్ నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Purna Chandra
First published: