Home /News /technology /

ALERT FOR FACEBOOK USERS THIS SOCIAL MEDIA GIANT PLANNING TO RENAME THE COMPANY ON OCTOBER 28 SS GH

Facebook: ఫేస్​బుక్​ యూజర్లకు అలర్ట్... అక్టోబర్​ 28న కీలక ప్రకటన?

Facebook: ఫేస్​బుక్​ యూజర్లకు అలర్ట్... అక్టోబర్​ 28న కీలక ప్రకటన?
(ప్రతీకాత్మక చిత్రం)

Facebook: ఫేస్​బుక్​ యూజర్లకు అలర్ట్... అక్టోబర్​ 28న కీలక ప్రకటన? (ప్రతీకాత్మక చిత్రం)

Facebook | ఫేస్‌బుక్ యూజర్లకు అలర్ట్. అక్టోబర్ 28న ఫేస్‌బుక్ (Facebook) కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా (Social Media) దిగ్గజం అయిన ఫేస్‌బుక్ రీబ్రాండింగ్ గురించి ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ (Facebook) గురించి తెలియని వారు ఉండరు. కోట్లాది మంది యూజర్లు గల ఫేస్​బుక్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఎంతలా అంటే ఇటీవల కేవలం 6 గంటల పాటు ఫేస్​బుక్ సేవలు నిలిచిపోగా.. ప్రపంచమే స్తంభించినంత పనైంది. యూజర్లు ట్విట్టర్​ (Twitter) వేదికగా గగ్గోలు పెట్టిన సందర్భాన్ని చూశాం. అటువంటి ఫేస్​బుక్​కి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే మరి!. తాజాగా ఫేస్​బుక్​కు సంబంధించిన ఓ కొత్త న్యూస్​ వైరల్​ అవుతోంది. ఫేస్​బుక్​ ఇంక్​ తన పేరు మార్చనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేయడానికి యోచిస్తున్నట్లు మంగళవారం ‘ది వెర్జ్’​ (The Verge) నివేదిక పేర్కొనడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది.

Poco F3 GT: తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ... రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే కొనండి ఇలా

అక్టోబర్ 28న ప్రకటన


అక్టోబర్ 28న ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ నిర్వహించే కంపెనీ వార్షిక కనెక్ట్ కాన్ఫరెన్స్‌లో పేరు మార్పు గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. అదే సమావేశంలో కొత్త పేరు ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ది వెర్జ్​ నివేదిక పేర్కొంది. అయితే, ఏ పేరుతో ఫేస్​బుక్​ రీబ్రాండ్​ కానుంది? ఎందుకు మార్చనుంది? అనే విషయాలపై మాత్రం స్పష్టతలేదు.

WhatsApp New Feature: వాట్సప్‌లో గ్రూప్ కాల్స్‌లో కొత్త ఫీచర్... మీరూ వాడుకోండి ఇలా

కొత్తగా 10 వేల మంది నియమించుకోనున్న సంస్థ


రీబ్రాండ్ అవుతున్న ఫేస్‌బుక్ యాప్‌ తన మాతృ సంస్థ ఫేస్​బుక్​ ఇంక్​ కింద అనేక యాప్స్​లో ఒకటిగా ఉండనుంది. ఫేస్​బుక్​ ఇంక్​ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఓకులస్తో పాటు మరిన్ని సోషల్​ మీడియా, ఛాటింగ్​ యాప్స్​ను నిర్వహిస్తోంది. వీటి సరసన కొత్త ఫేస్​బుక్​ రీబ్రాండ్​ యాప్​ చేరనుంది. అయితే, ది వెర్జ్​ నివేదికలో ప్రచురించిన కథనంపై ఫేస్​బుక్​ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే, ఫేస్​బుక్​ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో యూరోపియర్​ యూనియన్​ (ఈయూ)లో 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. ఫేస్​బుక్​ చేపట్టబోయే మెటావర్స్​ (వర్చువల్ రియాలిటీ స్పేస్​) నిర్మాణంలో వీరు భాగస్వామ్యులు కానున్నారని పేర్కొంది. కాగా, మెటావర్స్ ప్రాజెక్ట్​ కోసం ఫేస్​బుక్​ 50 మిలియన్​ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ​ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​పై రాబ్లాక్స్​ కార్ప్​, ఎపిక్​ గేమ్స్​ వంటి కంపెనీలు పని చేస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Facebook, Instagram, Social Media, Twitter, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు