Home /News /technology /

ALERT FOR CREDIT CARD AND DEBIT CARD HOLDERS YOU NEED TO ENTER CARD NUMBER FOR EVERY ONLINE TRANSACTION FROM JULY 1 SS

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఇక ప్రతీసారి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఇక ప్రతీసారి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఇక ప్రతీసారి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి (ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారా? ఇక ప్రతీ పేమెంట్‌కు మీ క్రెడిట్ కార్డ్ (Credit Card) లేదా డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో డెబిట్ కార్డ్ (Debit Card) కన్నా క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసేవారే ఎక్కువ. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు క్రెడిట్ కార్డులపై (Credit Card) డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంటాయి. అందుకే క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేప్పుడు ఒకసారి కార్డు వివరాలు సేవ్ చేస్తే సరిపోతుంది. ప్రతీ పేమెంట్‌కు ముందే సేవ్ చేసిన కార్డ్ వివరాలు ఉపయోగించవచ్చు. సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయొచ్చు. కానీ జూలై 1 నుంచి కొత్త రూల్ రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం ఏ సంస్థ కూడా కార్డ్ వివరాలను సేవ్ చేయకూడదు. కార్డ్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కార్డ్ వివరాలు సేవ్ చేయకపోతే పేమెంట్స్ ఎలా అన్న సందేహం మామూలే. జూలై 1 నుంచి ప్రతీ పేమెంట్‌కు కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెలలో ఎన్నిసార్లు షాపింగ్ చేస్తే అన్నిసార్లు కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇలా పదేపదే కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా టోకెనైజేషన్ విధానాన్ని అమలు చేస్తోంది ఆర్‌బీఐ.

LIC Policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే ఏటా రూ.36,000 రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

కార్డ్ టోకెనైజేషన్ విధానం ద్వారా యూజర్లు ఓ క్రెడిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేసి టోకెన్ క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్‌లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీ కార్డు వివరాలు ఎంటర్ చేసి టోకెన్ క్రియేట్ చేయాలి. కార్డ్ జారీ చేసిన సంస్థ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు టోకెన్ క్రియేట్ అవుతుంది. మీ కార్డు వివరాలు ఫ్లిప్‌కార్ట్‌లో సేవ్ కావు. కాబట్టి కార్డ్ వివరాలు లీక్ అవుతాయన్న ఆందోళన అవసరం లేదు. కార్డ్ టోకెనైజేషన్ చేసినా పేమెంట్ పూర్తి చేయడానికి సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి.

Bank Charges: ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా? జూన్ 15 నుంచి కొత్త ఛార్జీలు



ఒకవేళ మీ కార్డు టోకెనైజేషన్ చేయడం మీకు ఇష్టం లేకపోతే పేమెంట్ చేసే ప్రతీసారి కార్డు నెంబర్, సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుకే కాదు డెబిట్ కార్డుకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ఇప్పటికే 16 కోట్ల టోకెన్లు క్రియేట్ అయ్యాయి. ఆర్‌బీఐ టోకెనైజేషన్ విధానాన్ని అమలు చేసేందుకు కొన్ని నెలలుగా కృషి చేస్తోంది. జూన్ 30 వరకు మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఇప్పట్లాగే చేయొచ్చు. కానీ జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit card, Credit cards, Debit cards, Online shopping, Personal Finance, Reserve Bank of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు