హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Paytm Gold | లాక్‌డౌన్ సమయంలో పేటీఎం డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై 90 కిలోల బంగారాన్ని అమ్మింది. పేటీఎంలో డిజిటల్ గోల్డ్ కొంటే MMTC-PAMP 24 క్యారట్ 99.99 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని పొందొచ్చు.

అక్షయ తృతీయ సందర్భంగా పేటీఎం ఆఫర్ ప్రకటించింది. పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నగల దుకాణాలు మూతపడ్డాయి. అయితే ఈ పర్వదినాన్ని మిస్ కాకుండా మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనొచ్చు. రూ.1 నుంచి ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. 100 శాతం వరకు గోల్డ్‌బ్యాక్ పొందొచ్చు. ఎంఎంటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న పేటీఎం కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఏప్రిల్ 24న ఈ ఆఫర్ ప్రారంభమైంది. ఒకరు 100% గోల్డ్ బ్యాక్ రూ.3,000 వరకు పొందొచ్చు. ఈ ఆఫర్ 2020 ఏప్రిల్ 26 వరకు ఉంటుంది.

లాక్‌డౌన్ సమయంలో పేటీఎం డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై 90 కిలోల బంగారాన్ని అమ్మింది. పేటీఎంలో డిజిటల్ గోల్డ్ కొంటే MMTC-PAMP 24 క్యారట్ 99.99 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని పొందొచ్చు. ఎలాంటి ఛార్జీలు లేకుండా గోల్డ్ లాకర్ ఫెసిలిటీలో స్టోర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత బంగారాన్ని ఇంటికే డెలివరీ చేయనుంది పేటీఎం.

ఇవి కూడా చదవండి:

WhatsApp: కరోనావైరస్ ఎఫెక్ట్... వాట్సప్‌లోకి 21 కొత్త స్టిక్కర్స్ వచ్చాయి

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఆ ఫీచర్ వచ్చేసింది

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Paytm, Silver rates

ఉత్తమ కథలు