హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xstream Vs JioFiber: జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్స్

Xstream Vs JioFiber: జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్స్

Xstream Vs JioFiber: జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Xstream Vs JioFiber: జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Xstream Vs JioFiber | ఎక్స్‌స్ట్రీమ్ అల్ట్రా ప్లాన్ 300 ఎంబీపీఎస్‌తో, ఎక్స్‌స్ట్రీమ్ వీఐపీ ప్లాన్ రూ.3999 ధరలో 1జీబీపీఎస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అప్డేటెడ్ ప్లాన్లను త్వరలో ప్రకటిస్తామని సంస్థ ప్రకటించింది.

ఇంకా చదవండి ...

  ఎయిర్‌టెల్, జియో సంస్థల మధ్య డేటా వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా జియో ఫైబర్‌కు పోటీగా ఎయిర్టెల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీ ధరలను ప్రకటించింది. అన్‌లిమిటెడ్ డేటాను ధరల వారీగా నిర్ణీత స్పీడ్‌తో అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. న్యూ జియో బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీ ధరలను రిలయన్స్ జియో ప్రకటించిన తరువాతే పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ప్యాకేజీలను ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్నెట్ ధరల విషయంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న ఈ రెండు సంస్థలూ వినియోగదారులకు అతి తక్కువ ధరలకే డేటాను అందిస్తుండటం విశేషం.

  ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ట్యారిఫ్ ప్లాన్ రూ.499తో మొదలవుతుంది. ఇది 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో ఫైబర్ ప్రకటించిన రూ.399 ప్యాకేజీకి (0 ఎంబీపీఎస్ స్పీడ్) పోటీగా ఎయిర్‌టెల్ దీన్ని ప్రకటించింది. రూ.799, రూ.999. రూ.1499 ప్లాన్లు అప్‌డేట్ చేసిన ఎయిర్‌టెల్ , రూ.3999 ప్లాన్ ను అలాగే ఉంచింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్ర్ట్సీమ్ ప్రీమియం ప్లాన్ రూ.799తో అన్‌లిమిటెడ్ డేటా, 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అందుబాటులోకి వచ్చింది. రూ.999తో ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాతో 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉంది. ఎక్స్‌స్ట్రీమ్ అల్ట్రా ప్లాన్ 300 ఎంబీపీఎస్‌తో, ఎక్స్‌స్ట్రీమ్ వీఐపీ ప్లాన్ రూ.3999 ధరలో 1జీబీపీఎస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అప్డేటెడ్ ప్లాన్లను త్వరలో ప్రకటిస్తామని సంస్థ ప్రకటించింది. ఈరోజు సంస్థ వెబ్సైట్లో పాత రూ.299 ప్లాన్ వివరాలను తొలగించినప్పుడే కొత్త ఆఫర్లను తీసుకురానున్నట్లు తెలిసింది. ఎంచుకున్న ప్లాన్లను బట్టి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లు ఎయిర్టెల్ డిష్ టీవీ, డిస్నీ ప్లస్, అమేజాన్ ప్రైమ్, జీ5 వంటి వీడియో స్ర్టీమింగ్ ప్లాట్ఫాంలో సబ్స్ర్కిప్షన్ పొందొచ్చు. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ ఫెయిర్ యూసేజ్ పాలసీ(ఎఫ్ యూ పీ) అన్‌మిటెడ్ స్పీడ్‌తో నెలకు 3333జీబీ వరకు ఉంది. ఇది ఇప్పటికీ అలానే కొనసాగే అవకాశం ఉంది. జియో కూడా 3300 డేటాను ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద నెలవారీగా అందించనుంది.

  కొద్ది రోజుల క్రితం జియో ఫైబర్ డేటా ధరలను తక్కువ ధరలకే ప్రకటించిన జియో 30 ఎంబీపీఎస్ నుంచి 1ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్లను ప్రకటించింది. రూ.399 నుంచి రూ.3999 మధ్యలో ప్లాన్లు ఉన్నాయి. రూ.399 బేసిక్ ధరతో మొదలైన ప్లాన్ 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉండగా, రూ.699 ప్లాన్ 100 ఎంబీపీఎస్. రూ.999 ప్లాన్ 150 ఎంబీపీఎస్, రూ.1499 ప్లాన్ 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను అందిస్తోంది. గతంలో ఉన్న ప్లాన్లలో డేటా లిమిట్‌ను ఇప్పుడు రెండు సంస్థలూ తొలగించాయి. ఇప్పుడు డేటాను అపరిమితంగా ఇస్తూనే ధరల వారీగా డేటా స్పీడ్‌ను రెండు సంస్థలూ ప్రకటించాయి.

  ఎయిర్టెల్ మాదిరిగానే జియో ఫైబర్ సబ్స్కైబర్లు కూడా ప్యాకేజీని బట్టి సుమారు 12 వీడియో స్ట్రీమింగ్ యాప్ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL

  ఉత్తమ కథలు