హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel Xstream Vs JioFiber.. తారా స్థాయికి చేరిన బ్రాండ్ బ్యాండ్ వార్.. పోటాపోటీగా ఈ సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే..

Airtel Xstream Vs JioFiber.. తారా స్థాయికి చేరిన బ్రాండ్ బ్యాండ్ వార్.. పోటాపోటీగా ఈ సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మునుపెన్నడూ లేని స్థాయిలో బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల సంఖ్య తారాస్థాయికి చేరగా ఈ సర్వీసు ప్రొవైడర్ల మధ్య మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, జియో ఫైబర్ మధ్య పోటీ యుద్ధం సాగుతోంది.

ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య మనదేశంలో కరోనా టైంలో విపరీతంగా పెరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల సంఖ్య తారాస్థాయికి చేరగా ఈ సర్వీసు ప్రొవైడర్ల మధ్య మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, జియో ఫైబర్ మధ్య పోటీ యుద్ధం సాగుతోంది. 999 రూపాయలు, 1499 రూపాయలు, 3999 రూపాయలకు ఎయిర్ టెల్, జియో అందిస్తున్న బ్రాడ్ బ్యాండ్ పాపులర్ ప్లాన్స్ ప్రస్తుతం మార్కెట్లో ఊరిస్తున్నాయి. ఇంతకీ ఈ రెండు సంస్థలు పోటాపోటీగా ఊరిస్తున్న ప్యాకేజీలో ఏముందనేగా మీ అనుమానం. అయితే ఈ కింది విషయాలు తెలుసుకోండి.

 జియోఫైబర్ ఫ్రీ ట్రయల్..

4X4 రౌటర్, అన్ లిమిటెడ్ డేటాను 3,999 రూపాయల విలువైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లో ఇస్తున్నట్టు తాజాగా ఎయిర్ టెల్ ప్రకటించింది. దీనికి పైఎత్తుగా జియో ఫైబర్ ప్లాన్స్ ఏకంగా నెలపాటు ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇస్తామని, రీఫండబుల్ బెనిఫిట్ కూడా ఉండటం తమ ప్రత్యేకత అంటూ జియోఫైబర్ భారీ ఆఫర్ అమలుచేస్తోంది. ఇక ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ రూ. 499తో ప్రారంభమవుతుండగా, జియోఫైబర్ మాత్రం తన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను కేవలం రూ.399 కే అందిస్తోంది. ఎయిర్ టెల్, జియోఫైబర్ రెండూ 999 రూపాయల ప్లాన్స్, 1,499 రూపాయల ప్లాన్స్ తో పాటు 3,999 రూపాయల ప్లాన్స్ ను అందుబాటులో ఉంచాయి. ఈ జెయింట్ టెల్కోల ఆఫర్లను కంపేర్ చేస్తే మరెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.

Airtel Xstream టాప్ టైర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్

ఎయిర్ టెల్ ఎంటర్టైన్మెంట్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ రూ.999 తో ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ కింద అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, కాల్స్ తో పాటు 200 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా సమకూరుతుంది. ఇక అల్ట్రా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ విషయానికి వస్తే దీని ధర 1,499 రూపాయలు. అల్ట్రా బ్రాడ్ బ్యాండ్ కింద అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , 300 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు లోకల్ , ఎస్ట్టీడీ కాల్స్ అన్ లిమిటెడ్ గా చేసుకునే చాన్సుంటుంది. VIP బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కింద రూ.3,999 చెల్లిస్తే ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ వీఐపీ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీని కింద అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, 1 Gbps స్పీడ్, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో పాటు 1 Gbps కవరేజ్ తో పనిచేసే వైఫై 4X4 రౌటర్ ను ఎయిర్ టెల్ ఇస్తోంది. దీన్ని చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

యాక్టివ్ టీడీహెచ్ తప్పనిసరి..

ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ కింద 4k Tv Boxతో పాటు 10,000+ మూవీలు, షోస్, ఒరిజినల్ సిరీస్ ఫ్రం 7 OTT app, 5 స్టూడియోస్ అన్ని ప్లాన్లకు కల్పిస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. కానీ ఎంటర్ టైన్మెంట్, అల్ట్రా, వీఐపీ ప్లాన్లు మాత్రమే Amazon Prime Video, Disney+ Hotstar, Zee 5 సర్వీసులు ఇస్తుండగా, అన్ని ప్లాన్లలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ OTT సర్వీసులైన Lionsgate, Voot Basic, Eros Now, Hungama Play, Shemaroo Me and Ultra వంటివాటికి యాక్సెస్ ఉంటుంది. వీటన్నింటితో పాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్, వింక్ మ్యూజిక్ వంటి వాటికి యాక్సెస్ ఉంటుంది. Airtel Xstream Boxపై ఆన్ లైన్ కంటెంట్ చూడాలంటే మాత్రం Active DTH సబ్స్క్రిప్షన్ తప్పనిసరి.

జియో ఫైబర్ టాప్ టయర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ఇవే..

జియోఫైబర్ 999 రూపాయల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ కింద ట్రూలీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ విత్ డౌన్ లోడ్ అండ్ అప్ లోడ్ స్పీడ్ 150 Mbpsను కల్పిస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 14 OTT appsలో.. 1,000 రూపాయల విలువైన Amazon Prime, Disney + Hotstar వంటి వాటికి ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.

జియోఫైబర్ 1,499 రూపాయల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్: జియో ఫైబర్ అందిస్తున్న మరో టాప్ టయర్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ కింద ట్రూలీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ విత్ డౌన్ లోడ్ అండ్ అప్ లోడ్ స్పీడ్ 300 Mbpsను కల్పిస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 15 OTT appsకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.

జియో ఫైబర్ రూ.1,500 ట్రయల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్: ఇది రీఫండబుల్ ప్లాన్, ట్రయల్ ప్లాన్ గా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 30 రోజుల వ్యాలిడిటీతో నే రెంటల్ కాస్ట్ తో మీరు జియో ఫైబర్ సేవలను టెస్ట్ చేయవచ్చు. ఈ ప్లాన్ కింద 150 Mbpsడేటా, నెలకు 3.3 TB FUP లిమిట్ లభిస్తుంది. ఎలాంటి FUP లిమిట్ లేకుండా అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ లభిస్తుంది. ఇందులో ఎటువంటి ఓటీటీ బెనిఫిట్లు ఉండవు. కానీ ఫ్రీ మోడెం లేదా రౌటర్ ను ఈ ప్లాన్ తో పొందవచ్చు. కానీ 30 రోజుల ట్రయల్ తరువాత ఈ డివైజులను వర్కింగ్ కండిషన్ లో సంస్థకు వెనక్కు తిరిగి ఇచ్చేస్తేనే మీకు డిపాజిట్, అడ్వాన్స్ ను జియో రీఫండ్ చేస్తుంది.

జియోఫైబర్ రూ.3,999 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ లో మీకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ విత్ 1 Gbps ఇంటర్నెట్ స్పీడ్ పర్ సెకెండ్ ఉండేలా జియోఫైబర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ. 1,650 మంత్లీ సబ్స్క్రిప్షన్ విలువ చేసే 15 ఓటీటీ యాప్స్ కు యాక్సెస్ కూడా ఇస్తోంది.

మొత్తానికి ఎయిర్ టెల్, జియో ఫైబర్ లు అందిస్తున్న ప్లాన్స్, వాటి ఫీచర్లను పరిశీలిస్తే మాత్రం జియో ఫైబర్ ఆఫర్ చాలా ఊరించేదిగా ఆకట్టుకునేలా ఉంది. ఎయిర్ టెల్ ప్లాన్స్ ఎక్కువ స్పీడ్ ఇస్తుండగా, జియోఫైబర్ ఆఫర్ లో ఎక్కువ ఓటీటీ బెనిఫిట్లున్నాయి. ఎయిర్ టెల్ వైఫై రౌటర్ ఆఫర్ చూస్తే.. వర్క్ ఫ్రం, చిన్న ఆఫీసులకు రూ. 3,000 ప్లాన్ బాగుంటుంది.

First published:

Tags: AIRTEL, Internet, Jio fiber, Mobile Data

ఉత్తమ కథలు