Home /News /technology /

AIRTEL XSTREAM PREMIUM PLATFORM LAUNCHED WITH 15 OTT SERVICES JUST FOR RS 149 PER MONTH SS

Airtel: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్... రూ.149 చెల్లిస్తే 15 ఓటీటీ సేవలు

Airtel: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్... రూ.149 చెల్లిస్తే 15 ఓటీటీ సేవలు
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్... రూ.149 చెల్లిస్తే 15 ఓటీటీ సేవలు (ప్రతీకాత్మక చిత్రం)

Airtel | మీరు ఓటీటీ సేవల కోసం వేర్వేరుగా రీఛార్జ్ చేస్తుంటారా? ఇలా వేర్వేరు ఓటీటీ సేవలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎయిర్‌టెల్ ఒకే ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం (Airtel Xstream Premium) ద్వారా యూజర్లు 15 రకాల ఓటీటీ సేవలు పొందొచ్చు.

ఇంకా చదవండి ...
    ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎయిర్‌టెల్ తాజాగా 'ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం' (Airtel Xtream Premium) సర్వీస్‌ను ప్రారంభించింది. ఒకే ప్లాట్‌ఫామ్ పైన భారతీయ ఓటీటీ సర్వీసులతో (OTT Services) పాటు గ్లోబల్ ఓటీటీ సేవల్ని అందించనుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, టీవీల్లో ఈ ఓటీటీ సేవలు పొందొచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్లు నెలకు కేవలం రూ.149 చెల్లిస్తే చాలు 15 ఓటీటీ సేవలు పొందొచ్చు. ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1,499 చెల్లించాలి. ఈ ప్లాన్‌పై మొత్తం 15 రకాల ఓటీటీ సేవలు లభిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సెట్ టాప్ బాక్స్ వాడుతున్నవారికీ ఆఫర్ ఉంది. ఇప్పటికే ఉన్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది అప్‌గ్రేడ్ లాంటిది. యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కొత్త సేవలు పొందొచ్చు.

    ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రైబర్స్‌కు సోనీలివ్, ఎరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, హోయ్‌చోయ్, మనోరమామ్యాక్స్, షెమారూ, అల్‌ట్రా, హంగామాప్లే, ఎపిక్‌ఆన్, డాకుబే, డివోటీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్, షార్ట్స్ టీవీ నుంచి లైవ్ ఛానెల్స్, 10,500 సినిమాలు, షోస్ యాక్సెస్ లభిస్తుంది. వీటికి వేర్వేరుగా సబ్‌స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎయిర్‌టెల్ 'ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం' ప్లాన్ తీసుకొని అన్ని ఓటీటీ సేవలు పొందొచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి సేవలు ఇందులో ఉండవు.

    Tecno Pop 5 Pro: ఏఐ కెమెరా ఫీచర్స్, 6000mAh బ్యాటరీ... రూ.312 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు

    భారతదేశంలో ఓటీటీ కంటెంట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిష్కారంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం తీసుకొస్తున్నామని, ఇది అనేక సవాళ్లకు పరిష్కారమని ఎయిర్‌టెల్ డిజిటల్ సీఈఓ ఆదర్శ్ నాయర్ తెలిపారు. ఇది కస్టమర్లకు, ఓటీటీ ప్లేయర్స్‌కు మేలు చేసే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని అన్నారు. ఒకే సబ్‌స్క్రిప్షన్, ఒకే సైన్ ఇన్‌తో ఈ సర్వీస్ యాక్సెస్ చేయొచ్చు. కంటెంట్ సెర్చ్, పర్సనలైజేషన్ సింపుల్‌గా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సర్వీస్ ద్వారా రెండు కోట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్స్ పొందాలని ఎయిర్‌టెల్ టార్గెట్‌గా పెట్టుకుంది.

    Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? క్లీన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవండి

    నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రధాన ఓటీటీ సేవలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ద్వారా లభించవు. కానీ... వీటితో స్వతంత్ర భాగస్వామ్యాన్ని కొనసాగించనుంది ఎయిర్‌టెల్. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్ యూజర్లు రూ.719, రూ.479, రూ.299, రూ.265, రూ.839, రూ.549, రూ.359, రూ.455, రూ.1799, రూ.155, రూ.209, రూ.239 ప్లాన్స్ రీఛార్జ్ చేయాలి. ఇక రూ.2999, రూ.3359, రూ.838, రూ.599, రూ.499 ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటితో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Amazon prime, Disney+ Hotstar, Ott

    తదుపరి వార్తలు