Airtel XStream: ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ నుంచి రూ.99 ధరకే సెక్యూర్‌ ఇంటర్నెట్‌

Airtel XStream: ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ నుంచి రూ.99 ధరకే సెక్యూర్‌ ఇంటర్నెట్‌ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel XStream | మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను సురక్షితంగా మార్చాలనుకుంటున్నారా? రూ.99 ధరకే సెక్యూర్ ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తోంది ఎయిర్‌టెల్.

  • Share this:
ఇంటర్నెట్‌లో అన్నీ సెక్యూర్డ్‌గానే కనిపిస్తాయి. కానీ జాగ్రత్త చూస్తే.. ఏది మంచిదో, ఏదో కాదో చెప్పడం చాలా కష్టం. అందుకే బ్రౌజింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్‌ కొత్త ఆలోచన తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ వాడేవాళ్లకు సైబర్‌ రక్షణ ఇచ్చేలా కొత్తగా సెక్యూర్‌ ఇంటర్నెట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మాల్‌వేర్‌ బ్లాక్‌ చేయడం, హైరిస్క్‌ ఉన్న వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను బ్లాక్‌ చేయడం లాంటివి చేయొచ్చట. దాని వల్ల సైబర్‌ దాడులు జరగకుండా చూడొచ్చని ఎయిర్‌టెల్‌ చెబుతోంది. ఎక్స్‌ట్రీమ్‌కు కనెక్ట్‌ అయి ఉన్న అన్ని డివైజ్‌లకు ఈ రక్షణ లభిస్తుంది.

సెక్యూర్‌ ఇంటర్నెట్‌ ఆన్‌లైన్‌ రిమోట్‌ వర్కింగ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం ఇంటర్నెట్‌ వినియోగించేవారికి ఉపయుక్తంగా ఉంటుందట. ఇందులో ఇంకా చాలా సర్వీసులు ఉన్నాయి. పిల్లల కోసం సేఫ్‌ అండ్‌ స్టడీ మోడ్‌ ఇస్తున్నారు. దాని ద్వారా పిల్లలు ఏయే వెబ్‌సైట్లు చూడాలి అనుకుంటున్నారో... తల్లిదండ్రులు నిర్ణయించొచ్చు. అంగీకరించని వెబ్‌సైట్లు, పోర్న్‌ కంటెంట్‌, ఇబ్బంది కంటెంట్‌ ఉన్న వెబ్‌సైట్లు ఓపెన్‌ చేస్తే... సెక్యూర్‌ ఇంటర్నెట్‌ టూల్‌ ఆపేస్తుంది. ఈ మొత్తం సేవలకు గాను ఎయిర్‌టెల్‌ నెలకు ₹99 వసూలు చేస్తోంది. ప్రారంభ ఆఫర్‌ కింద నెలపాటు ఉచితంగా వాడుకునే సౌకర్యం ఇస్తున్నారు. ఈ ఆప్షన్‌ కావాలంటే... ‘మై ఎయిర్‌టెల్‌’ యాప్‌లోకి వెళ్లి యాక్టివ్‌ చేసుకోవచ్చు. డీయాక్టివ్‌ చేయాలన్నా యాప్‌లో చేయాల్సిందే.

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే

Amazon Price Error: రూ.96,700 విలువైన ఇన్వర్టర్ ఏసీ రూ.5900 ధరకే... ప్రైస్ ఎర్రర్‌తో లాభపడిన కస్టమర్లు

సెక్యూర్‌ ఇంటర్నెట్‌ తీసుకురావడానికి గత కారణాలను కూడా ఎయిర్‌టెల్‌ వివరించింది. 2020లో సీఈఆర్‌టీ-ఐఎన్‌ వివరాల ప్రకారం సైబర్‌ ఎటాక్‌ల సంఖ్య సుమారు 300 శాతం పెరిగింది. గత 12 నెలల్లో 59 శాతం మంది భారతీయ యువత సైబర్‌ క్రైమ్‌ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు నోర్టాన్‌ సైబర్‌ సేఫ్టీ ఇటీవల నివేదికలో తెలియజేసింది. ఇలాంటి సమస్యల నుండి మన దేశ యువతను బయటపడేయడానికి సెక్యూర్‌ ఇంటర్నెట్‌ మంచి ఆప్షన్‌ అని ఎయిర్‌టెల్‌ చెబుతోంది. దీని వల్ల వినియోగదారుల డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇంకా మెరుగ్గా ఉండబోతోందని ఎయిర్‌టెల్‌ చెబుతోంది.

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇటీవల తీసుకున్న 5 కీలక నిర్ణయాలు తెలుసుకోండి

Amazon Prime Subscription: 50 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి ఇలా

మరోవైపు ఎయిర్‌టెల్ ఇతర టెలికాం ఉత్పత్తుల మీద కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ సర్వీసెస్‌ను తీసుకొచ్చింది. ఇది ఆల్‌ ఇన్‌ వన్‌ హోం సొల్యూషన్‌. ఇందులో బ్రాడ్‌బ్యాండ్‌, డీటీహెచ్‌, మొబైల్‌ సర్వీసులు ఉంటాయి. ఈ ఫైబర్ ప్లాన్‌ను నెలకు ₹499కే అందిస్తున్నారు. డీటీహెచ్‌ ప్లాన్‌ ధర ₹153 కాగా, మొబైల్‌ ప్లాన్‌ ధర ₹499. మరిన్ని వివరాలు ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ వెబ్‌సైట్లో చూడొచ్చు.
Published by:Santhosh Kumar S
First published: