Airtel News | మీరు కొత్తగా డీటీహెచ్ సర్వీసులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే హెచ్‌డీ డీటీహెచ్ బ్యాక్స్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎయిర్‌టెల్ (Airtel) కంపెనీ ఈ ఆఫర్ తీసుకువచ్చింది. తక్కువ ధరకే డీటీహెచ్ (DTH) బాక్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.
ఎయిర్‌టెల్ డీటీహెచ్ కనెక్షన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ నెంబర్ వంటి వివరాలు అందించి ఆఫర్ పొందొచ్చు. ఇది కొంత కాలమే ఉంటుందని గుర్తించుకోవాలి. కాగా ఎయిర్‌టెల్ హెచ్‌డీ డీటీహెచ్ బాక్స్ ధర సాధారణంగా రూ.2 వేలు ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు దీన్ని రూ. 750కే సొంతం చేసుకోవచ్చు.
20 పైసలతో కిలోమీటర్ వెళ్లొచ్చు.. 125 కి.మి. రేంజ్‌తో అదరగొడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్!
అలాగే ఎయిర్‌టెల్ పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచింది. 6 నెలలు లేదా ఆపైన ప్యాక్స్ ఎంచుకుంటే కనీసం 40 శాతం తగ్గింపు పొందొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అలాగే మీ వద్ద డిష్ యాంటినా ఉంటే.. అప్పుడు రూ.500 తగ్గింపు పొందొచ్చని తెలియజేస్తోంది. అలాగే ఎంపిక చేసిన సర్కిళ్లలో రూ. 500 ప్రారంభ ధరతో డీటీహెచ్ హెచ్‌డీ బాక్స్ ప్లస్ యాంటినా అందిస్తోంది. అలాగే రెండో డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తే.. రూ. 750 స్పెషల్ రేటు చెల్లిస్తే సరిపోతుంది.
ఫ్లిప్‌కార్ట్ ఊరించే ఆఫర్.. రూ.999కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ!
ఇకపోతే ఎయిర్‌టెల్ డీటీహెచ్ సర్వీసుల ద్వారా హెచ్‌డీ క్లారీటీ, డాల్బే సౌండ్, 550కి పైగా ఛానళ్లు, ఫ్రీ అండ్ సేఫ్ ఇన్‌స్టలేషన్, పాజ్ రికార్డ్ అండ్ ప్లే లైవ్ టీవీ ఆప్షన్స్, పెన్ డ్రైవ్ నుంచి వీడియోలు ప్లే చేసుకోవడం వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే 24 గంటలు కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.
అందువల్ల మీరు కొత్తగా డీటీహెచ్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఎయిర్‌టెల్ అందిస్తున్నఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలోనే డీటీహెచ్ కనెక్షన్ పొందొచ్చు. కాగా ఇంకా టాటా ప్లే, డిష్ టీవీ వంటి కంపెనీలు కూడా డీటీహెచ్ సర్వీసులు అందిస్తున్నాయి. అందువల్ల మీరు ఈ కంపెనీల నుంచి కూడా మీకు నచ్చిన విధంగా డీటీహెచ్ కనెక్షన్ పొందొచ్చు. మీకు దగ్గరిలోని డిస్ట్రిబ్యూటర్ వద్దకు లేదంటే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా ఆఫర్లను చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ తక్కువకే సర్వీసులు లభిస్తున్నాయో వాటిని ఎంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, DTH, Latest offers, Smart TV, TV channels