హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel: ఎయిర్​టెల్​ పోస్ట్​పెయిడ్​ ప్లాన్లలో మార్పులు.. అదనపు డేటా ప్రయోజనాలివే!

Airtel: ఎయిర్​టెల్​ పోస్ట్​పెయిడ్​ ప్లాన్లలో మార్పులు.. అదనపు డేటా ప్రయోజనాలివే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ ప్లాన్లను సవరించనున్నట్లు ప్రకటించింది. ఎయిర్టెల్ అందిస్తున్న రూ .249 పోస్ట్‌పెయి?

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్​ తన పోస్ట్​పెయిడ్​ ప్లాన్లను సవరించనున్నట్లు ప్రకటించింది. ఎయిర్​టెల్​ అందిస్తున్న రూ .249 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్లాన్​ ధర రూ .50 మేర పెరగనుంది. దీనికి అనుగుణంగా ప్రయోజనాలు కూడా పెరగనున్నాయి. దీంతో ఈ ప్లాన్​ ఇకపై నెలకు రూ .299 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్​ కింద ప్రస్తుతం 10 జిబి డేటాను అందిస్తోంది. అయితే, ధర పెరుగుదలతో ఇకపై 30 జిబి డేటా లభిస్తుందని ఎయిర్​టెల్​ పేర్కొంది. ఇక, రూ. 999 విలువ గల మరో పోస్ట్​పెయిడ్​ ప్లాన్​ ధరలో మాత్రం ఎటువంటి మార్పు చేయనప్పటికీ.. ప్రయోజనాల్లో మాత్రం మార్పులు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ కాల్స్​తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 150 జిబి అందిస్తుంది. 200 జిబి వరకు డేటా రోల్‌ఓవర్‌ కూడా అందిస్తుంది. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ + హాట్‌స్టార్‌ విఐపి, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌ వంటి ఓటీటీలకు కు ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది. అదనంగా హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్​ కూడా అందిస్తుంది.

పోస్ట్​పెయిడ్​​​ ప్లాన్​ ప్రయోజనాలు పెంపు..

ఇక, రూ.999 విలువ గల​ ప్లాన్​ 4 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లకు అనుమతిస్తుంది.- వీటిలో 3 రెగ్యులర్ ప్లస్ వన్ యాడ్-ఆన్, డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్ల సంఖ్య 4 నుండి 3 కి తగ్గుతుంది. టెల్కో ఎంత డేటా ఇస్తుందనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. భారతదేశంలోని అన్ని ప్రముఖ టెల్కో సంస్థలు గతేడాది డిపెంబర్​లో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్​ టారిఫ్​లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో, వొడాఫోన్ కూడా​ ప్రతి ప్లాన్​పై రూ .50 ధర పెంచింది. కొత్త ప్లాన్ల ప్రకారం రూ .649, రూ .799, రూ .999, రూ .1348 వద్ద ఫ్యామిలీ ప్లాన్లు లభిస్తాయి. ఇక, రూ. 399, రూ .499, రూ .699, రూ .1099 ధర వద్ద పర్సనల్ పోస్ట్​ పెయిడ్ ప్లాన్లు లభిస్తాయి. అయితే, ఎయిర్​టెల్​ రూ .999 పోస్ట్​పెయిడ్​ ప్లాన్​ ప్రయోజనాలను మార్చినప్పటికీ, వొడాఫోన్​ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వొడాఫోన్​ రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద 200GB నెలవారీ డేటా, 200GB డేటా రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, 100 SMS లను అందిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఐదు కనెక్షన్లకు అనుమతిస్తుంది. వీటిలో- ఒక బేసిక్​, నాలుగు యాడ్-ఆన్‌ ప్లాన్లు ఉంటాయి. దీని కింద ప్రైమరీ యూజర్లకు 80GB డేటా, సెకండరీ యూజర్లకు 30GB డేటా అందిస్తుంది. ప్రైమరీ యూజర్ల కోసం డేటా రోల్‌ఓవర్ కింద 200GB అందిస్తుండగా, సెకండరీ యూజర్లకు 50GB డేటా అందిస్తుంది. ఇక, ప్రైమరీ యూజర్లకు ZEE5 ప్రీమియం, అమెజాన్ ప్రైమ్, Vi మూవీస్, టీవీలకు యాక్సెస్​ అందిస్తుంది. అయితే, సెకండరీ యూజర్లకు మాత్రం Vi మూవీస్, టీవీలకు మాత్రమే యాక్సెస్ లభిస్తుంది.


ఇది చూడండి...


ఇది చూడండి...

First published:

Tags: AIRTEL

ఉత్తమ కథలు