జియో ఫైబర్ అధికారికంగా రిలీజ్ కాబోతున్న సమయంలో ఎయిర్టెల్ టీవీ ప్లాట్‌ఫామ్ 'ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్'గా మారింది. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్, ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఎయిర్టెల్. జియో ఫైబర్, అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా వీటిని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4కే హైబ్రిడ్ బాక్స్ ధర రూ.3,999. సెట్ టాప్ బాక్స్, ఓటీటీ కంటెంట్ కలిపి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఎయిర్టెల్ రూపొందించింది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు కొత్త సెట్ టాప్ బాక్స్‌ను రూ.2,249 చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ తీసుకున్న వారికి రూ.999 విలువైన ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు హెచ్డీ డీటీహెచ్ ప్యాక్ ఒక నెల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ రీటైల్ స్టోర్స్, Airtel.in, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో వీటిని కొనొచ్చు. 500 టీవీ ఛానెళ్లతో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10,000 పైగా సినిమాలు, షోస్ చూడొచ్చు. జీ5, ఎరోస్ నౌ, హంగామా ప్లే లాంటి ఓటీటీ కంటెంట్ పార్ట్‌నర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఎయిర్టెల్. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ కూడా ఉంటాయి.
ఇక ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ కూడా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ లాంటిదే. కానీ ఇందులో డీటీహెచ్ ఛానెల్స్ ఉండవు. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీసెస్ మాత్రమే లభిస్తాయి. ఇందులో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ఉంటుంది. స్ట్రీమింగ్ పార్ట్నర్స్కు చెందిన కంటెంట్ లభిస్తుంది. బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఉంటాయి. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ ధర రూ.3,999. ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్లాటినమ్, గోల్డ్ కస్టమర్లకు ఒక నెల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఆ తర్వాత వార్షిక సబ్‌స్క్రిప్షన్‌కు రూ.999 చెల్లించాలి. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. Airtel.in వెబ్సైట్, ఎయిర్టెల్ రీటైల్ స్టోర్స్, క్రోమా లాంటి ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు.
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Vodafone Offer: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.20 రీఛార్జ్ చేస్తే చాలు
Discount: ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 డిస్కౌంట్
August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, DTH, Reliance Jio, TRAI