ఎయిర్‌టెల్ కొత్త నిర్ణయంతో కస్టమర్లకు షాక్..

యూజర్ నుంచి పొందే యావరేజ్ రెవెన్యూను పెంచడానికే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.త్వరలోనే వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: July 29, 2019, 2:20 PM IST
ఎయిర్‌టెల్ కొత్త నిర్ణయంతో కస్టమర్లకు షాక్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 29, 2019, 2:20 PM IST
ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. వాలిడిటీ ముగిసిన తర్వాత ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్‌ పొందే గడువును ఇకనుంచి కేవలం 7 రోజులకే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు 15రోజుల వరకు ఈ వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని వారానికే కుదించాలని నిర్ణయించింది. వారం తర్వాత రీచార్జ్ చేయించకపోతే.. ఇక ఇన్‌కమింగ్ కాల్స్‌ బంద్ అన్నట్టే. యూజర్ నుంచి పొందే యావరేజ్ రెవెన్యూను పెంచడానికే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.త్వరలోనే వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థకే చేటు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరింతమంది ఎయిర్‌టెల్ కస్టమర్స్ జియో వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు.జియో ఎంట్రీతో ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్న ఎయిర్‌టెల్‌‌పై ఇది మరింత ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటున్నారు.


First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...