హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel Xstream: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర తగ్గింది... ఎంతంటే

Airtel Xstream: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర తగ్గింది... ఎంతంటే

Airtel Xstream: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర తగ్గింది... ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Xstream: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర తగ్గింది... ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Xstream Box | ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధరను భారీగా తగ్గించింది ఎయిర్‌టెల్. ఈ బాక్సు లేటెస్ట్ ధర, బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ (Airtel Xstream Box) ధర రూ.499 తగ్గింది. గతంలో రూ.2,499 గా ఉన్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర ధర కాస్తా రూ.2,000 కి చేరుకుంది. కొత్తగా ఎక్స్‌స్ట్రీమ్ బాక్సుతో పాటు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ తీసుకునేవారికి ఇది వర్తిస్తుంది. డీటీహెచ్ సెట్ టాప్ బాక్సుతో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ 2019 లో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ (Airtel Xstream Stick) కూడా లాంఛ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, ఎరాస్ నౌ లాంటి యాప్స్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఆథరైజ్డ్ డీలర్ల ద్వారా కొత్త కనెక్షన్లు తీసుకునేవారికి కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. తర్వాత ధర పెరగొచ్చు.

Apps Banned: 320 మొబైల్ యాప్స్ బ్లాక్... ప్రకటించిన కేంద్ర మంత్రి

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ప్రత్యేకతలు చూస్తే ఇది ఆండ్రాయిడ్ 9 బేస్డ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ ప్రీలోడెడ్‌గా వస్తుంది. 5,000పైగా యాప్స్, గేమ్స్ యాక్సెస్ చేయొచ్చు. క్రోమ్‌క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్‌తో సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. 4కే రెజల్యూషన్‌తో వీడియోలు చూడొచ్చు. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ నుంచే కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. ఓటీటీ యాప్స్‌తో పాటు డీటీహెచ్ లాగా ఈ బాక్సును వాడుకోవచ్చు. 500 పైగా టీవీ ఛానెళ్లు చూడొచ్చు. ఓటీటీ, డీటీహెచ్ సేవల్ని పొందాలనుకుంటే నెలకు కనీసం రూ.153 చెల్లించాలి.

Android App: అలర్ట్... ఈ ఆండ్రాయిడ్ యాప్ వెంటనే డిలిట్ చేయండి

గత నెలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం ప్లాన్ ధర పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకు రూ.149 చెల్లించాలి. ప్రీమియం ప్లాన్‌లో 10,000 పైగా మూవీ షోస్, టీవీ షోస్, ఒరిజినల్స్ చూడొచ్చు. ఇంగ్లీష్‌తో పాటు 13 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. గతంలో ఈ ప్యాక్ ధర నెలకు రూ.49, ఏడాదికి రూ.499 ఉండేది. కానీ ధర పెరగడంతో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కస్టమర్లు తర్వాత నెలకు రూ.149, ఏడాదికి రూ.1499 చెల్లించాలి.

First published:

Tags: AIRTEL

ఉత్తమ కథలు