AIRTEL PAYMENTS BANK AND ICICI LOMBARD OFFERS SMARTPHONE INSURANCE KNOW ALL DETAILS SS
Smartphone Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు... ప్రీమియం ఎంతంటే
Smartphone Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు... ప్రీమియం ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Smartphone Insurance | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? మరి మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ తీసుకున్నారా? మొబైల్‌కు కూడా ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank) కస్టమర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ ఇస్తోంది.
భారతదేశంలో ప్రతీ రోజూ లక్షల్లో స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోతుంటాయి. మొబైల్ ఫోన్లతో పాటు స్మార్ట్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ డివైజ్‌లు కూడా బాగానే కొంటుంటారు యూజర్లు. స్మార్ట్ఫోన్లకు ఇన్స్యూరెన్స్ (Smartphone Insurance) అందించే కంపెనీలు ఉన్నాయి. లేటెస్ట్గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank), ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కలిసి స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. డిజిటల్ పద్ధతిలోనే ఇన్స్యూరెన్స్ కొనొచ్చు. ప్రాసెస్ కూడా వేగంగా జరిగిపోతుంది.
ఐసీఐసీఐ లాంబార్డ్ అందించే స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌కు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ డ్యామేజ్ అయినా, కింద పడి పగిలిపోయినా, నీళ్లు, ఇతర లిక్విడ్స్ పడి స్మార్ట్‌ఫోన్ పాడైనా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. పాలసీ పీరియడ్‌లో రెండుసార్లు క్లెయిమ్ చేయొచ్చు. ఉచితంగా పికప్, డెలివరీ సదుపాయం కూడా ఉంది.
భారతదేశంలో 750 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. 2026 నాటికి 1 బిలియన్ యూజర్లకు చేరుకోవచ్చని అంచనా. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొడక్ట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రొటెక్షన్ ప్లాన్ అందించేందుకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కస్టమర్లకు వారి స్మార్ట్ఫోన్లు ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయినా, దొంగిలించబడినా ఇన్స్యూరెన్స్ అదనపు భద్రతను అందిస్తుంది. ఇలాంటి బీమా పాలసీలు ఎంచుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది.
ఐసీఐసీఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ డిజిటల్ పద్ధతిలో సులువుగా తీసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ప్రారంభ ధర రూ.1,299. మీ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటే అంత ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ కొన్న 10 రోజుల్లోపే ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ.10,000 నుంచి రూ.1,00,000 లోపు స్మార్ట్ఫోన్లకు ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో మీ స్మార్ట్‌ఫోన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ఇన్స్యూరెన్స్ వచ్చేస్తుంది.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మన లైఫ్‌లైన్ లాంటిది. కనెక్టివిటీ నుంచి ఫోటోగ్రఫీ నుంచి బ్యాంకింగ్ వరకు స్మార్ట్ఫోన్లు అనేక రకాలుగా సాయపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ రిపేర్ ఖర్చు చాలా ఎక్కువ. అందుకే మొదటి నుంచే ప్రొటెక్షన్ అవసరం. స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్‌ని అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది.
— గణేష్ అనంతనారాయణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
ఐసీఐసీఐ లాంబార్డ్ ఇప్పటికే లక్షలాది కస్టమర్లకు పర్సనలైజ్డ్, సులభతరమైన ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ అందిస్తోంది. IL TakeCare App యాప్ ద్వారా పాలసీలు కొనడం, క్లెయిమ్స్ మేనేజ్ చేయడం, పాలసీలు రెన్యువల్ చేయడం లాంటి ేసేవలన్నీ పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.