మీరు ఎయిర్టెల్ కస్టమరా? వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? మీరు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లోకి మారితే అనేక లాభాలున్నాయి. ఇతర ఆపరేటర్లకు చెందిన కస్టమర్లు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లోకి మారితే ప్రస్తుత నెట్‌వర్క్‌లో ఉన్న క్రెడిట్ లిమిట్‌ను క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది జియో. ఈ ప్రాసెస్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవు. సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని జియో ప్రకటించింది. 'క్యారీ ఫార్వర్డ్ యువర్ లిమిట్' పేరుతో ఈ ఫీచర్ ప్రకటించింది జియో. ఇటీవల పోస్ట్‌పెయిడ్ సర్వీసెస్ సెగ్మెంట్‌పైన దృష్టిపెట్టిన జియో కనీవినీఎరుగని ఆఫర్లతో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. రూ.399 నుంచే ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆఫర్స్ అందించడం కోసం ఇతర నెట్‌వర్క్స్‌లోని పోస్ట్ పెయిడ్ కస్టమర్లు సులువుగా జియో పోస్ట్ పెయిడ్ ప్లస్‌లోకి మారేందుకు కొత్త సర్వీస్ లాంఛ్ చేసింది జియో. కేవలం మూడు స్టెప్స్‌లో ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ నుంచి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్‌లోకి సులువుగా మారొచ్చు. ఆ స్టెప్స్ ఎలాగో తెలుసుకోండి.
Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు
An Important announcement from Jio:
Get JioPostpaid Plus & the Credit Limit of your choice without paying a single rupee.#JioPostPaidPlus #JioDhanDhanaDhan #JioDigital #JioCricket #JioTogether pic.twitter.com/RacSX9lR9Q
— Reliance Jio (@reliancejio) October 8, 2020
ముందుగా మీరు జియోలోకి మారాలనుకుంటున్న పోస్ట్ పెయిడ్ నెంబర్ నుంచి 88-501-88-501 నెంబర్‌కు వాట్సప్‌లో 'Hi' అని మెసేజ్ టైప్ చేసి పంపించండి. ఆ తర్వాత మీ పోస్ట్ పెయిడ్ బిల్‌ను అప్లోడ్ చేయండి. 24 గంటల తర్వాత మీరు ఏదైనా జియో స్టోర్‌కు వెళ్లి జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్ తీసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉండదు. మీరు కావాలంటే జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్ కార్డును హోమ్ డెలివరీ చేయమని కూడా కోరొచ్చు. జియో ఏజెంట్ మీ ఇంటికి సిమ్ కార్డును తీసుకొచ్చి మరీ ఇస్తారు.
Money Transfer: మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
SBI Yono app: ఎస్బీఐ యోనో యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక సులువుగా బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా
యో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్స్ తీసుకునేవారికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 650 పైగా లైవ్ ఛానెల్స్, వీడియో కంటెంట్ చూడొచ్చు. 5 కోట్ల పాటల్ని వినొచ్చు. 300 పైగా న్యూస్ పేపర్స్‌ని చదవొచ్చు. అంతేకాదు... హైక్వాలిటీ కనెక్టివిటీ, అంతులేని ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంటర్నేషనల్ రోమింగ్, వినూత్నమైన ఫీచర్స్, బెస్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తోంది జియో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio