AIRTEL OFFERS DATA ADD ON PLANS WITH PRIME VIDEO MOBILE SUBSCRIPTION AND OTHER BENEFITS SS
Airtel Data Plans: ఎయిర్టెల్ నుంచి డేటా ప్లాన్స్... ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కూడా
ప్రతీకాత్మక చిత్రం
Airtel Data Plans | ఎయిర్టెల్ రూ.19 నుంచే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ (Airtel Data add on Plans) అందిస్తోంది. ఓ ప్లాన్‌పై ప్రైమ్ వీడియో మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.
మొబైల్ డేటా వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక రోజులో 3జీబీ డేటా కూడా ఉపయోగించేవారు ఉన్నారు. కంపెనీ ఇస్తున్న డేటా చాలకపోతే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. ఎయిర్టెల్ యూజర్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా డేటా ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ప్లాన్‌పై మొబైల్ డేటా చాలకపోతే అదనంగా ఈ డేటా ప్లాన్స్ (Airtel Data Plans) రీఛార్జ్ చేయొచ్చు. ఈ ప్లాన్స్‌పై మొబైల్ డేటా అదనంగా లభిస్తుంది. కొన్ని ప్లాన్స్‌పై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (Prime Video Mobile Edition), వింక్ మ్యూజిక్ ప్రీమియం, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్స్‌పై వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఉండవు. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోండి.
Airtel Rs 19 Data Plan:ఎయిర్టెల్ రూ.19 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 1 జీబీ డేటా లభిస్తుంది.
Airtel Rs 58 Data Plan:ఎయిర్టెల్ రూ.58 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 3 జీబీ డేటా లభిస్తుంది.
Airtel Rs 98 Data Plan:ఎయిర్టెల్ రూ.98 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 5 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ ఉండదు. వింక్ మ్యూజిక్ ప్రీమియం ఉచితం.
Airtel Rs 108 Data Plan:ఎయిర్టెల్ రూ.108 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 6 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ ఉండదు. ప్రైమ్ వీడియో మొబైల్ సబ్స్క్రిప్షన్ 30 రోజుల పాటు లభిస్తుంది. హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితంగా పొందొచ్చు.
Airtel Rs 118 Data Plan:ఎయిర్టెల్ రూ.118 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 12 జీబీ డేటా లభిస్తుంది.
Airtel Rs 148 Data Plan:ఎయిర్టెల్ రూ.148 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 15 జీబీ డేటా లభిస్తుంది. ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ 28 రోజుల పాటు యాక్సెస్ లభిస్తుంది.
Airtel Rs 301 Data Plan:ఎయిర్టెల్ రూ.301 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50 జీబీ డేటా లభిస్తుంది. వింక్ మ్యూజిక్ ఉచితం.
పైన చెప్పిన ఈ ప్లాన్స్‌కు వేలిడిటీ ఉండదు. యాక్టీవ్ ప్లాన్ ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. అంటే ఇప్పటికే రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేసినవారు తమకు అదనంగా డేటా కావాలనుకుంటే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. డైలీ డేటా లిమిట్ పూర్తైన తర్వాత యాడ్ ఆన్ ప్యాక్‌లోనే డేటా వాడుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.