Home /News /technology /

AIRTEL OFFERS DAILY 2GB MOBILE DATA ON THESE 7 PREPAID RECHARGE PLANS KNOW BENEFITS SS

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే 7 ప్లాన్స్ ఇవే

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే 7 ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే 7 ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel 2GB Plans | ఎయిర్‌టెల్ 7 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌పై (Prepaid Recharge Plans) రోజూ 2జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్స్‌పై కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మీరు ఎయిర్‌టెల్ యూజరా? మొబైల్ డేటా కోసం ఎయిర్‌టెల్ నెట్వర్క్ వాడుతున్నారా? ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా (Airtel 2GB Data Plans) ఇచ్చే ప్లాన్స్ 7 ఉన్నాయి. ఈ ప్లాన్స్ రూ.179 నుంచి ప్రారంభం అవుతాయి. ఏడాది ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి రోజూ 2జీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. ఉచిత కోటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ గ్గుతుంది. మరి ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయి? ఆ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? తెలుసుకోండి.

Airtel Rs 2999 Plan: ఎయిర్‌టెల్ రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 670జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 839 Plan: ఎయిర్‌టెల్ రూ.839 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Calling Feature: మీరు కాల్స్ ఎక్కువగా చేస్తారా? మరి ఈ ఫీచర్ వాడుతున్నారా?

Airtel Rs 549 Plan: ఎయిర్‌టెల్ రూ.549 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 499 Plan: ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

UPI Payment: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ చేస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి



Airtel Rs 359 Plan: ఎయిర్‌టెల్ రూ.359 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 319 Plan: ఎయిర్‌టెల్ రూ.319 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 179 Plan: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. 48జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: AIRTEL, Airtel recharge plans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు