AIRTEL OFFERS 2GB COMPLIMENTARY DATA WITH PURCHASE PRODUCTS EVK
Airtel Offers: ఎయిర్టెల్లో 2జీబీ కాంప్లిమెంటరీ డెటా.. ఎలా పొందాలో తెలుసా
(ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్టెల్(Airtel) తన యూజర్లకు త్వరలో ఎటువంటి అందనపు ఖర్చు లేకుండా 2జీబీ డేటాను అందించేందుకు ప్రయత్నిస్తుందిఎయిర్టెల్ అందించే బోనస్ డేటాను పొందడానికి వినియోగదారులు టెల్కో భాగస్వామ్యంతో ఎంచుకున్న ఉత్పత్తిని(Product) కొనుగోలు చేసి ఆపై ప్రయోజనాన్ని క్లెయిమ్(Claim) చేయడానికి అందించిన కోడ్(Code)ని ఉపయోగించవలసి ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఎయిర్టెల్(Airtel) తన యూజర్లకు త్వరలో ఎటువంటి అందనపు ఖర్చు లేకుండా 2జీబీ డేటాను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఇండియాలో పలు మొబైల్ ఆపరేటర్లు ఇలాంటి సదుపాయన్ని వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇప్పుడు అదే వరుసలో ఎయిర్టెల్ నిలిచింది. ఎయిర్టెల్ అందించే బోనస్ డేటాను పొందడానికి వినియోగదారులు టెల్కో భాగస్వామ్యంతో ఎంచుకున్న ఉత్పత్తిని కొనుగోలు చేసి ఆపై ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి అందించిన కోడ్ని ఉపయోగించవలసి ఉంటుందని సంస్థ వెల్లడించింది. కాంప్లిమెంటరీ డెటా ఇలా పొందవచ్చు..
ఎయిర్టెల్ తన కో బ్రాండింగ్ కార్యక్రమాన్ని ఇండియాలో తిరిగి ప్రారంభించనుంది. కొన్ని ఆన్లైన్ వేదికల్లో టెల్కో యొక్క ప్రీపెయిడ్(Prepaid) వినియోగదారులు ఈ ప్రొడెక్టుల కొనుగోలు మీద 2GB వరకు కాంప్లిమెంటరీ(Complimentary) డేటాను పొందడానికి అర్హులు అవుతారు. ఈ ఆఫర్ కో-బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది.
ఈ ఒప్పందం మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటుంది. అంకుల్ చిప్స్, కుర్కురే, లేస్ మరియు డోరిటోస్ వంటి ఉత్పత్తులపై ఎయిర్టెల్ పేరు బ్రాండ్ చేయబడుతుంది. ఈ కో-బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులు ప్యాకెట్ లోపల ముద్రించిన ‘ఉచిత డేటా వోచర్ కోడ్' (Data voucher Code) కోసం వెతకవలసి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లోని ‘మై కూపన్'(My coupons) విభాగానికి వెళ్లి ప్యాకేజింగ్ నుంచి పొందిన వోచర్ కోడ్ను ఎంటర్ చేసి డేటా యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. వినియోగదారులకు పలు సేవలు..
ఎయిర్టెల్ వినియోగదారులకు ఎయిర్టెల్ పేమెంట్స్(Airtel Payments) సేవలు కూడా అందిస్తోంది. ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది. ఏఈపీఎస్లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్(Banking) పాయింట్లతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ను(Network) కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% ఏఈపీఎస్ ఎనేబుల్ చేయబడ్డాయి. ఏఈపీఎస్(AePS) ప్లాట్ఫామ్ ద్వారా ఆధార్ ఎనేబుల్ చేయబడిన బ్యాంక్ అకౌంట్(Bank Account) ఉన్న ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా బ్యాంక్ సేవలు అందించగలిగింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.