Home /News /technology /

AIRTEL OFFERS 1GB DAILY MOBILE DATA ON THESE PREPAID RECHARGE PLANS KNOW BENEFITS SS

Airtel 1GB Plans: రోజూ 1జీబీ డేటా చాలా? తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ప్లాన్స్

Airtel 1GB Plans: రోజూ 1జీబీ డేటా చాలా? తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ప్లాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel 1GB Plans: రోజూ 1జీబీ డేటా చాలా? తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ప్లాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel 1GB Plans | రోజూ మొబైల్ డేటా తక్కువ వాడుకునే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ కేవలం 1జీబీ లేదా 1.5జీబీ డేటాతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ (Airtel Prepaid Plans) అందిస్తోంది. ఈ ప్లాన్స్‌పై కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? కాల్స్ కోసం ఎయిర్‌టెల్ (Airtel) సిమ్ కార్డ్ వాడుతున్నారా? మొబైల్ డేటా ఎక్కువగా అవసరం లేదా? అయితే ఎయిర్‌టెల్ నుంచి తక్కువ డేటా అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Airtel Plans) ఉన్నాయి. కేవలం రోజూ 1జీబీ లేదా 1.5జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్స్ రూ.209 నుంచే ప్రారంభం అవుతాయి. ఈ ప్లాన్స్‌పై వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

రోజూ 1.5జీబీ మొబైల్ డేటా లభించే ప్లాన్స్ ఇవే...


Airtel Rs 719 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 126జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

5G Smartphones: 4G కన్నా 10 రెట్ల వేగంతో 5G వచ్చేస్తోంది... రూ.15,000 లోపు 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Airtel Rs 666 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 77 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 115.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 479 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 299 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 42జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Loan in 30 seconds: వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్

రోజూ 1జీబీ డేటా లభించే ప్లాన్స్ ఇవే...


Airtel Rs 265 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.265 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా చొప్పున మొత్తం 28జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 239 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా చొప్పున మొత్తం 24జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 209 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.209 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 21 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా చొప్పున మొత్తం 21జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.

Airtel Rs 155 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.155 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 24 రోజులకు 1జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉచితం. 24 రోజులకు 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: AIRTEL, Airtel recharge plans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు