తొందరలో ఐపీఎల్ సీజన్ 2 ప్రారంభం కాబోంతోంది. క్రికెట్ అభిమానులకు మళ్లీ ఫుల్ జోషలో అభిమాన క్రీడాకారుల ఆటను ఆస్వాదించ బోతున్నారు. ఈ నేపథ్యంలో పలు టెలికాం కంపెనీలు కొత్త డాటా ప్యాకేజీ(Data Pack)లతో మార్కెట్లో(Market)కి వస్తున్నానాయి. ఎక్కువ మంది బయట పనిలో ఉండి వీలున్నప్పుడు ఫోన్లో ఐపీఎల్ చూస్తుంటారు. వారినే ప్రధాన లక్ష్యంగా టెలికాం(Telecom) కంపెనీ(Company)లు డేటా ప్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. టెలికాం రంగంలో భారతీ ఎయిర్టెల్ ప్రత్యేకమైన ఆఫర్ల(Offers)తో వినియోగదారులను ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో కొత్త ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రీపెయిడ్(Prepaid), పోస్ట్‌పెయిడ్ మరియు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు వినియోగిస్తున్న వారికి ఐపీఎల్(IPL) రెండో సీజన్ చూసేందుకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. స్మార్ట్ ఫోన్లో డిస్నీ+ హాట్‌స్టార్(Disney+Hot star)కు సబ్స్క్రిప్షన్ లేకుండా కేవలం మొబైల్ రీచార్జ్‌తో ఐపీఎల్ చూసే అవకాశాన్నిఇస్తోంది. ఐపీఎల్ 2021 ను ఉచితంగా చూడాలనుకునే వారికి భారతీ ఎయిర్టెల్ అందించే వారికి ఎయిర్టెల్ అందించే ఆఫర్ల గురించి తెసుకోండి.
YouTube: అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసిన యూట్యూబ్.. మొబైల్ యూజర్స్‌కు స్పెషల్.. పూర్తి వివరాలు ఇవే..
ఏమిటా ఆఫర్లు..
- IPL 2021 కోసం భారతీ ఎయిర్టెల్ ప్లాన్లు భారతీ ఎయిర్టెల్(Airte) యొక్క మూడు ప్రీపెయిడ్ ప్లాన్లు డిస్నీ+ హాట్‌స్టార్ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి.
- ఈ ప్లాన్లు రూ.499, రూ.699 మరియు రూ.2,798 ధరల వద్ద లభిస్తాయి.
- ఇందులో రూ.499 ప్లాన్ 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.
- రూ.699 మరియు రూ.2,798 ప్లాన్లు రెండూ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను వరుసగా 56 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి.
- ఈ ప్లాన్లన్నీ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు, 100 SMSతో పాటు రోజు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్(Mobile)కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి.
- వీటితోపాటు ఎయిర్టెల్ థాంక్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- ఈ ప్లాన్లు ఐపిఎల్ 2021 రెండవ సీజన్(Second Session) చూడటానికి ఎంతో ఉపయోగపడతాయి.
- డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ యొక్క స్వతంత్ర చందా ధర సంవత్సరానికి రూ.499 అని గమనించండి.
ఐపీఎల్-2021 సెకండ్ ఫేజ్ (IPL-2021 Second Phase) కోసం అంతా సిద్ధమైంది. జట్లన్నీ మ్యాచ్ లు ఆడేందుకు యూఏఈ చేరుకున్నాయి. ఇంగ్లాండ్ (England)నుంచి నేరుగా దుబాయ్ (Dubai) వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians-Chennai Super Kings) జట్ల మధ్య సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, IPL 2021, Mobile Data