హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

TRAI: మరింత పెరిగిన Jio హవా.. కొత్తగా 35.54 లక్షల కస్టమర్లు.. Airtel నుంచి 46.13 లక్షల మంది ఔట్

TRAI: మరింత పెరిగిన Jio హవా.. కొత్తగా 35.54 లక్షల కస్టమర్లు.. Airtel నుంచి 46.13 లక్షల మంది ఔట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత మార్కెట్లో తనదే పైచేయి అని టెలికాం దిగ్గజం జియో మరోసారి నిరూపించుకుంది. భారీగా కొత్త ఖాతాదారుల నమోదుతో తానే నంబర్ 1 అని చాటింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ టెలికాం మార్కెట్లో జియో హవా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. తాజాగా మే నెలలో 35.54 లక్షల మొబైల్ వినియోగదారులు కొత్తగా జియో ఖాతాలో చేరడం విశేషం. అయితే ఎయిర్టెల్ పరిస్థితి మాత్రం రివర్స్ అవుతోంది. తాజాగా ఈ టెలికాం సంస్థ మరో 46.13 మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా(TRAI) తాజాగా వెల్లడించింది. తాజా లెక్కలతో జియో మత్తం కస్టమర్ల సంఖ్య 43.12 కోట్లకు చేరడం విశేషం. ఎయిర్టెల్ తో పాటు వొడాఫోన్ ఐడియా కూడా భారీగా కస్టమర్లను పోగొట్టుకుంది. ఈ సంస్థ మేలో 46.13 లక్షల కస్టమర్లను పోగొట్టుకోవడంతో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 34.8 కోట్లకు పడిపోయింది.

వొడాఫోన్ ఐడియా మొబైల్ సబ్క్రైబర్లు 42.8 లక్షల మేర తగ్గగా.. మొత్తం కస్టమర్ల సంఖ్య 27.7 కోట్లకు పడిపోయింది. అయితే ఇండియా మొత్తంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 62.7 లక్షలు పడిపోవడం గమనార్హం. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 117.6 కోట్లకు తగ్గింది.


ఏపీ, తెలంగాణలోనూ జియోనే నంబర్ 1..

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో తన హవాను కొనసాగించింది. మొత్తం 3,21,46,712 కస్టమర్లతో మార్కెట్లో మెజారిటీ వాటాను జియో సొంతం చేసుకుంది. మే నెలలో జియో 46,119 మంది కస్టమర్లను పెంచుకోగా.. ఎయిర్టెల్ నుంచి 4,08,257, వోడాఫోన్ ఐడియా 2,72,081 మంది కస్టమర్లను దూరమయ్యారు. ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ అయిన BSNL అత్యధికంగా 4,15,690 మంది వినియోగదారులను కోల్పోయింది.

First published:

Tags: AIRTEL, Jio, TRAI, Vodafone Idea

ఉత్తమ కథలు