Airtel Wi-Fi Calling: గుడ్ న్యూస్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' ప్రారంభం

Airtel Wi-Fi Calling: గుడ్ న్యూస్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' ప్రారంభం (image: Airtel)

Airtel Wi-Fi Calling | ఇందుకోసం మీరు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. ఇళ్లల్లో, ఆఫీసుల్లో మీరు వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.

  • Share this:
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' ప్రారంభమైంది. ఇటీవల టెలికాం కంపెనీలు వాయిస్ ఓవర్ వైఫై సర్వీస్‌ను టెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయెన్స్ జియో కూడా VoWiFi సర్వీస్‌ను పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇదే సర్వీస్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకునే అవకాశం ఈ సర్వీస్ ద్వారా లభిస్తుంది. అంటే... మీ మొబైల్‌లో సిగ్నల్ లేకపోయినా మీరు కాల్స్ చేసుకోవచ్చు. ఇలా కాల్స్ చేయడానికి వైఫై ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. ఇళ్లల్లో, ఆఫీసుల్లో మీరు వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.

    VoWiFi సామర్థ్యంపై కస్టమర్లకు ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫీచర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు మొదటిసారి అందించేందుకు ఎయిర్‌టెల్ చాలా కృషి చేసింది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన రంగంలో వైఫై ప్రాముఖ్యతను వివరించడానికి VoWiFi కాలింగ్ ప్రారంభించడం తోడ్పడుతుంది.
    అవ్నీత్ సింగ్ పూరీ, సీఈఓ, భారతీ ఎయిర్‌టెల్


    ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే. airtel.in/wifi-calling వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్ ఓపెన్ చేసి వైఫై కాలింగ్‌ను ఆన్ చేయాలి. VoLTE కూడా స్విచ్ ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఈ కింది స్మార్ట్‌ఫోన్లల్లో 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' సదుపాయం ఉంది.

    యాపిల్: యాపిల్ 6ఎస్ కన్నా ఎక్కువ మోడల్స్‌
    షావోమీ: రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో, పోకో ఎఫ్1
    సాంసంగ్: J6, A10s, On6, S10, S10+, S10e, M20
    వన్‌ప్లస్: వన్‌ప్లస్ 6, 7 సిరీస్

    ఇతర ఫోన్లల్లో కూడా 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' సదుపాయాన్ని కల్పించేందుకు ఎయిర్‌టెల్ కృషి చేస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌తో వైఫై కాలింగ్ పనిచేస్తుంది. త్వరలో ఇతర బ్రాడ్‌బ్రాండ్ సర్వీసెస్, వైఫై హాట్‌స్పాట్స్‌లో కూడా 'ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్' లభించనుంది. మరిన్ని వివరాలకు airtel.in/wifi-calling వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Zero Balance Accounts: ఈ 8 అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు

    Yearender 2019: ఈ ఏడాది రూ.20,000 లోపు రిలీజైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్‌... ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్
    Published by:Santhosh Kumar S
    First published: