AIRTEL LAUNCHES RS 499 RS 699 AND RS 2798 PREPAID PLANS WITH WITH DISNEY PLUS HOTSTAR MOBILE SUBSCRIPTION KNOW BENEFITS SS
Airtel New Plans: ఎయిర్టెల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Airtel New Plans: ఎయిర్టెల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Airtel New Plans | డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్ (Airtel New Plans) ప్రకటించింది. ఈ ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని (Prepaid Plans) ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.499 నుంచి మొదలవుతాయి. రూ.499, రూ.699, రూ.2,798 ప్లాన్స్‌ని కొత్తగా ప్రకటించింది ఎయిర్టెల్ (Airtel). ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ సబ్స్క్రిప్షన్ ఒక ఏడాది ఉచితంగా లభిస్తుంది. అయితే ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో ఉన్న ప్లాన్స్ కన్నా కొత్త ప్లాన్స్ ధర ఎక్కువ. ఇప్పటికే రిలయెన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఎక్స్ట్రా బెనిఫిట్స్‌తో 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎయిర్టెల్ 3 కొత్తప్లాన్స్ ప్రకటించింది. పాత ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఇచ్చిన ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది.
Airtel Rs 499 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Airtel Rs 699 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Airtel Rs 2798 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.2798 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
వీటిలో రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌పై వచ్చే బెనిఫిట్స్‌నే గతంలో రూ.448 ప్లాన్‌పై అందించింది ఎయిర్టెల్. ఇకపై రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండదు. ఇక రూ.699 ప్లాన్‌లో ఉన్న బెనిఫిట్స్‌ని గతంలో రూ.599 ప్లాన్‌లో లభించేవి. ఇకపై రూ.599 ప్లాన్ కూడా ఉండదు. ఇక రూ.2798 ప్లాన్‌పై వచ్చిన బెనిఫిట్స్ గతంలో రూ.2,698 ప్లాన్‌పై వచ్చేవి. ఇకపై రూ.2,698 ప్లాన్ కూడా ఉండదు. ఇప్పటికే ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నవారికి ఆ బెనిఫిట్స్ కొనసాగుతాయి. ఆ ప్లాన్స్ వేలిడిటీ పూర్తైన తర్వాత కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాలి.
కొత్త ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ 30 రోజులకు లభిస్తుంది. హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్సులు, ఎయిర్టెల్ యాప్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.