Airtel: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... వివరాలివే

Airtel: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel New Plans | మీరు ఎక్కువగా మొబైల్ డేటా వాడుతున్నారా? రోజువారీ డేటా సరిపోవట్లేదా? ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా ప్లాన్స్ ప్రకటించింది.

  • Share this:
    ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. సరికొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్‌ని ప్రారంభించింది ఎయిర్‌టెల్. రూ.251, రూ.98 ప్లాన్స్ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. దీంతో పాటు ఎక్కువగా డేటా వినియోగిస్తున్న యూజర్లు కూడా పెరిగారు. వీరిని దృష్టిలో పెట్టుకొని డేటా ప్యాక్‌ను ప్రకటించింది ఎయిర్‌టెల్. రూ.251 రీఛార్జ్ చేసిన వారికి 50 జీబీ డేటా లభిస్తుంది. ఇది డేటా ఓచర్ మాత్రమే. అంటే ఇందులో వేలిడిటీ రాదు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌కు అదనంగా 50 జీబీ డేటా లభిస్తుంది. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ ఉన్నవారికే ఈ డేటా ప్యాక్ ఉపయోగపడుతుంది. అది కూడా రోజువారి డేటా పూర్తిగా వాడేస్తున్నవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం.

    ఉదాహరణకు మీరు మంత్లీ ప్లాన్‌లో ఉన్నట్టైతే ఆ వేలిడిటీ పూర్తయ్యేవరకు అదనంగా 50 జీబీ డేటా ఉపయోగించడానికి రూ.251 రీఛార్జ్ చేయాలి. మంత్లీ ప్లాన్ ఎక్స్‌పైరీ అయితే రూ.251 ప్లాన్ కూడా ఎక్స్‌పైరీ అవుతుంది. ఒకవేళ మీరు యాన్యువల్ ప్లాన్‌లో ఉన్నట్టైతే రూ.251 రీఛార్జ్ చేసుకొని మీ ప్లాన్ గడువు ముగిసేవరకు 50 జీబీ డేటా అదనంగా వాడుకోవచ్చు. దీంతో పాటు రూ.98 డేటా ఓచర్ కూడా ప్రకటించింది ఎయిర్‌టెల్. రూ.251 ప్లాన్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. రూ.98 ప్లాన్‌లో మీకు కేవలం 12 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. రూ.98 ప్లాన్‌లో కూడా మీకు ఎలాంటి వేలిడిటీ లభించదు.

    వీటితో పాటు ఎయిర్‌టెల్ రూ.2,498 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వేలిడిటీ 365 రోజులు. యూజర్లకు రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ సెక్యూర్ మొబైల్ సెక్యూరిటీ యాంటీ వైరస్ సొల్యూషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్, హెలో ట్యూన్స్ ఉచితం. ఇటీవల రిలయెన్స్ జియో కూడా డేటా ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.151 ప్లాన్‌పై 30జీబీ, రూ.201 ప్లాన్‌పై 40జీబీ, రూ.251 ప్లాన్‌పై 50 జీబీ డేటా 30 రోజుల వేలిడిటీతో అందిస్తోంది రిలయెన్స్ జియో. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే

    Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

    Pension Scheme: గుడ్ న్యూస్... నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే స్కీమ్ గడువు పెంపు
    Published by:Santhosh Kumar S
    First published: