Airtel Black plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త సర్వీస్... ఒకే ప్లాన్‌పై మొబైల్, డీటీహెచ్, ఇంటర్నెట్ కనెక్షన్స్

Airtel Black plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త సర్వీస్... ఒకే ప్లాన్‌పై మొబైల్, డీటీహెచ్, ఇంటర్నెట్ కనెక్షన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Black plan | ఎయిర్‌టెల్ బ్లాక్ పేరుతో కొత్త ప్లాన్ వచ్చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే మొబైల్, డీటీహెచ్, ఇంటర్నెట్ కనెక్షన్స్ లభిస్తాయి.

  • Share this:
    ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. సరికొత్త ఆఫర్ ప్రకటించింది ఎయిర్‌టెల్. ఒకే ప్లాన్‌పై మొబైల్ కనెక్షన్, డీటీహెచ్, ఇంటర్నెట్ తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్ పేరుతో కొత్తగా వచ్చిన సర్వీస్ ఇది. ఎయిర్‌టెల్ బ్లాక్ కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ సర్వీసుల్ని బండిల్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్ ద్వారా ఒక ఇంటికి కావాల్సిన అన్ని సర్వీసుల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి ఆల్ ఇన్ వన్ ప్లాన్ అందిస్తోంది ఎయిర్‌టెల్. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ బండిల్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. వేర్వేరు కనెక్షన్స్ తీసుకొని వేర్వేరు బిల్స్ చెల్లించడం, ఆ బిల్స్ చెల్లించాల్సిన తేదీలను గుర్తుంచుకోవడం లాంటి సమస్యలు లేకుండా ఒకే ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. ఎయిర్‌టెల్ బ్లాక్ ద్వారా ఫిక్స్‌ప్లాన్స్ అందిస్తోంది ఎయిర్‌టెల్.

    Airtel Black All in one Plan: ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్స్‌లో ఆల్ ఇన్ వన్ ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.2,099 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో మూడు మొబైల్ కనెక్షన్స్, ఒక ఫైబర్ కనెక్షన్, ఒక డీటీహెచ్ కనెక్షన్ లభిస్తాయి.

    Smartphone Antivirus App: స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ యాప్ అవసరమా? తెలుసుకోండి

    WhatsApp New Features: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఈ 5 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

    Airtel Black Fiber + Mobile Plan: ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్స్‌లో ఫైబర్+మొబైల్ ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.1,598 చెల్లించాలి. రెండు మొబైల్ కనెక్షన్స్, ఒక ఫైబర్ కనెక్షన్ లభిస్తాయి.

    Airtel Black DTH + Mobile Plan: ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్స్‌లో డీటీహెచ్ + మొబైల్ ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.1,349 చెల్లించాలి. మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్ లభిస్తాయి. ఇందులోనే రూ.998 ప్లాన్ ఎంచుకుంటే రెండు మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్స్ లభిస్తాయి.

    Android New Features: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఈ 7 కొత్త ఫీచర్స్ మీకోసమే

    Top 10 Apps: ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే

    ఇవి మాత్రమే కాదు కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ కస్టమైజ్ చేసుకోచ్చు. కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సొంతగా ప్లాన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌కు వెళ్లి ప్లాన్ కస్టమజ్ చేసుకోవచ్చు. 8826655555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే ఎయిర్‌టెల్ ప్రతినిధులు సంప్రదగిస్తారు.
    Published by:Santhosh Kumar S
    First published: