టెలికామ్ కంపెనీలైన ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల (Prepaid Recharge Plans) ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ప్లాన్స్ ధరల్ని పెంచిన కంపెనీలు... కొత్త ప్లాన్స్ కూడా ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎయిర్టెల్ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.99 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రకటించడం విశేషం. ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ ప్లాన్స్, బేసిక్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ను వొడాఫోన్ ఐడియా ఇవ్వట్లేదు. దీంతో రిలయన్స్ జియో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు (TRAI) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లేకపోవడం వల్ల పోర్ట్ చేయాలనుకునే కస్టమర్లకు కష్టమవుతోందని జియో ట్రాయ్‌కు కంప్లైంట్ చేసింది. దీంతో వినియోగదారులు ఏ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ నుంచి పోర్ట్ కావడానికి అవకాశం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. ఇప్పుడు ఎయిర్టెల్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌తో రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించడం విశేషం.
Jio 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? జియో కొత్త ప్లాన్స్ ఇవే
ఎయిర్టెల్ రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రూ.99 టాక్‌టైమ్ వస్తుంది. వేలిడిటీ 28 రోజులు. 200ఎంబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ చేస్తే సెకన్‌కు ఒక పైసా చొప్పున ఛార్జీ ఉంటుంది. లోకల్ ఎస్ఎంఎస్కు ఒక రూపాయి, ఎస్టీడీ ఎస్ఎంఎస్కు రూ.1.5 చొప్పున చెల్లించాలి. ఇక ఎయిర్‌టెల్‌లో రూ.49 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రూ.38.52 టాక్‌టైమ్ లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. 100ఎంబీ డేటా వాడుకోవచ్చు. కాల్స్ చేస్తే సెకన్‌కు 2.5 పైసలు చెల్లించాలి.
ఎయిర్టెల్ రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్, 2జీబీ డేటా లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఎయిర్టెల్ రూ.265 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, రోజూ 1జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లాంటి ప్రయోజనాలున్నాయి.
Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే
ఇక రిలయన్స్ జియో నుంచి రూ.119 ప్లాన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో రూ.91 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 3జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇక జియో రూ.155 ప్లాన్‌పై 28 రోజుల వేలిడిటీ, 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. జియో రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ, రోజూ 1జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans