హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel 35 Plan: ఎయిర్‌టెల్ నుంచి రూ.35 కొత్త రీచార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!

Airtel 35 Plan: ఎయిర్‌టెల్ నుంచి రూ.35 కొత్త రీచార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!

Airtel 35 Plan: ఎయిర్‌టెల్ నుంచి రూ.35 కొత్త రీచార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!

Airtel 35 Plan: ఎయిర్‌టెల్ నుంచి రూ.35 కొత్త రీచార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!

Airtel Plan | మీరు ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే గుడ్ న్యూస్. కొత్త రీచార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఇది చౌక ధరల డేటా ప్లాన్. దీని బెనిఫిట్స్ ఏంటితో ఇప్పుడు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Airtel News | దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తాజాగా కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది చౌక ధరల రీచార్జ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ సైలెంట్‌గా ఈ ప్లాన్‌ను తెచ్చింది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే మొబైల్ యాప్‌లో మాత్రం ఈ రీచార్జ్ ప్లాన్ (Recharge) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చౌక ధరల రీచార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ తాజాగా రూ. 35 రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది ప్రిపెయిడ్ ప్లాన్. ఇది కేవలం డేటా ఓన్లీ ప్లాన్. అంటే రూ. 35 పెట్టి రీచార్జ్ చేసుకుంటే డేటా పొందొచ్చు. 2 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన వాలిడిటీ 2 రోజులు ఉంటుంది. అందువల్ల డేటా కోరుకునే వారు ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక జీబీ డేటాకు రూ. 17.5 చెల్లిస్తున్నామని అర్థం చేసుకోవాలి. రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్లతో పోలిస్తే ఇది కాస్త ప్రియం అని చెపుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్ రూ. 19 ప్లాన్‌తొ పోలిస్తే.. ఈ కొత్త ప్లాన్ చౌకగానే లభిస్తోందని అర్థం చేసుకోవాలి.

అబ్బా.. ఆఫర్ అంటే ఇది.. రూ.33,000 టీవీ రూ.6,999కే!

ఎయిర్‌టెల్ రూ. 19 ప్లాన్ ఒక జీబీ డేటాను అందిస్తుంది. ఒక రోజు వాలిడిటీ ఉంటుంది. అంటే రూ. 35తో 2 జీబీ డేటా వస్తుంది. రెండు రోజుల వాలిడిటీ లభిస్తుంది. 1 జీబీ లేదా 3 జీబీ డేటా కాకుండా 2 జీబీ డేటా కొరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎయిర్‌టెల్ 3 జీబీ డేటా ప్లాన్ ధర రూ. 58గా ఉంది. ఎవరైతే ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు పొందుతున్నారో.. వారు కూడా ఈ డేటా ప్యాక్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ త్వరలోనే తన వెబ్‌సైట్‌లో ఈ ప్లాన వివరాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. మీకు డేటా ప్లాన్ అవసరం లేదనుకుంటే ఇతర ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. అదనపు డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

5 జీబీ డేటా ఫ్రీ.. డిస్నీ హాట్‌స్టార్ ఏడాది ఉచితం! జనవరి 15 వరకే ఆఫర్!

కంపెనీ ఇప్పటికే రూ.19, రూ .58 ధరల్లో డేటా ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు రూ. 35 డేటా ప్లాన్ తెచ్చింది. అలాగే ఇటీవల కంపెనీ రూ. 65 ధరలో కూడా డేటా ప్లాన్స్‌ను ఆవిష్కరించింది. ఈ రూ. 65 డేటా ప్లాన్‌లో అయితే కస్టమర్లకు 4 జీబీ డేటా లభిస్తుంది. ప్రిపెయిడ్ ప్లాన వాటిడిటీనే ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది. తర్వాత రూ. 98 డేటా ప్లాన్ లభిస్తోంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 5 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా ప్రిపెయిడ్ ప్లాన్ వాడిలిటీతో సమానంగా ఉంటుంది. తర్వాత రూ. 118, రూ. 148, రూ. 181, రూ. 301 ధరల్లో డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద రూ. 12 జీబీ డేటా, 15 జీబీ డేటా, 1 జీబీ డెయిలీ, 50 జీబీ డేటా పొందొచ్చు. రూ. 181 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. అంటే మీకు ఈ ప్లాన్ కింద 30 జీబీ డేటా వస్తుంది.

First published:

Tags: AIRTEL, Airtel 5G Plus, Airtel recharge plans, Mobile recharge

ఉత్తమ కథలు