హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Best prepaid plans: 249కే అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్.. మరి వీటిలో ఏది బెస్ట్?

Best prepaid plans: 249కే అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్.. మరి వీటిలో ఏది బెస్ట్?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Best prepaid plans: ప్రతిరోజూ 2 జీబీ డేటా కావాలనుకునే ఎయిర్‌టెల్, Vi యూజర్లకు రూ.298, రూ.299 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. డేటా అవసరాలను బట్టి కస్టమర్లు వీటిని ఎంచుకోవచ్చు.

టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించిన తరువాత టారిఫ్‌ రేట్లు భారీగా తగ్గిపోయాయి. పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడూ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. సాధారణంగా ఎక్కువమంది యూజర్లు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే ప్లాన్లన ఎంచుకుంటారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని కంపెనీలు సైతం 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ విభాగంలో రూ.249తో ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్, Vi, జియో అందిస్తున్నాయి. దీని ద్వారా ఎయిర్‌టెల్, వీఐ కస్టమర్లు రోజుకు 1.5 జిబి డేటాను, 28 రోజుల వరకు పొందవచ్చు. వీటితో పోలిస్తే జియో అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ టారిఫ్‌తో కస్టమర్లకు ప్రతిరోజు 2జీబీ డేటాను జియో అందిస్తోంది. వ్యాలిడిటీని బట్టి అన్ని కంపెనీలు దాదాపు ఒకే ధరలో వివిధ ప్రయోజనాలను తమ యూజర్లకు అందిస్తున్నాయి. ప్రతిరోజూ 2 జీబీ డేటా కావాలనుకునే ఎయిర్‌టెల్, Vi యూజర్లకు రూ.298, రూ.299 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. డేటా అవసరాలను బట్టి కస్టమర్లు వీటిని ఎంచుకోవచ్చు.

* Vi- రూ.249

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో Vi రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. కస్టమర్లు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు వీకెండ్ రోల్‌ఓవర్ ఆఫర్లు, Vi మూవీస్, Vi టీవీలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

* జియో- రూ.249

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కస్టమర్లు రోజుకు 2GB డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు మొత్తం 56GB డేటా లభిస్తుంది. జియో నుంచి జియో నంబర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌ నంబర్లకు 1000 నిమిషాలు కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. అదనంగా జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

* ఎయిర్‌టెల్- రూ.249

రూ.249తో రీఛార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రతిరోజూ 1.5 జిబి డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు.

* Vi- రూ.299

రూ.299తో రీఛార్జ్ చేయించుకునే కస్టమర్లకు ప్రతిరోజూ 4GB డేటా, అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్ లభిస్తాయి. ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు వీకెండ్ రోల్‌ఓవర్ డేటా బెనిఫిట్‌ను పొందవచ్చు. వారంలో వాడకుండా మిగిల్చుకున్న డేటాను వీకెండ్‌లో వాడుకునే సదుపాయాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కల్పిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. MPL గేమ్స్ పై డిస్కౌంట్లు, జొమాటో ఆర్డర్లపై తగ్గింపులు, Vi మూవీస్, Vi టీవీ యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు.

* ఎయిర్‌టెల్- రూ.298

ఈ ప్లాన్‌తో కస్టమర్లు ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 SMSలు పొందవచ్చు. దీంతో పాటు యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ (Airtel XStream subscription), వింక్ మ్యూజిక్, ఫాస్టాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్, భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌ యాక్సెస్... వంటి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి రీఛార్జ్ చేసుకునే యూజర్లు రూ.50 డిస్కౌంట్, 2 జిబి అదనపు డేటాను కూడా పొందవచ్చు.

First published:

Tags: AIRTEL, Jio, Technology, Telecom

ఉత్తమ కథలు