ఇండియా (India)లో 5G సేవలను విస్తరించే పనిలో ఉన్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) కంపెనీ తాజాగా మరో కొత్త అప్డేట్తో ముందుకు వచ్చింది. ‘వరల్డ్ పాస్’ (World Pass) పేరుతో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ తాజా ప్లాన్లు 184 దేశాలలో పనిచేస్తాయి. ఇప్పుడు వినియోగదారులు కొత్త ప్యాక్‌ను కొనుగోలు చేయకుండా ఒకే రోమింగ్ ప్యాక్‌తో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించవచ్చు. వరల్డ్ పాస్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* అన్ని ప్రయాణ అవసరాలను తీర్చే ప్లాన్స్
ఎయిర్టెల్ వరల్డ్ పాస్ అనేది అన్ని ప్రయాణ అవసరాలను తీర్చే ప్యాక్. దీన్ని 184 దేశాలలో పనిచేసే పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కనెక్షన్ల కోసం ఇంటర్నల్ రోమింగ్ ప్లాన్ల సిరీస్‌గా పేర్కొంటున్నారు. ఈ ప్లాన్లు 99100-99100 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు 24x7 కస్టమర్ సపోర్ట్ అందిస్తాయి. ఈ నంబర్ వాట్సాప్ మెసేజెస్, కాల్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఒక దేశంలో ఎక్కువ కాలం ఉండేందుకు ప్లాన్ చేసే వారి కోసం ఒక సంవత్సరం వరకు వాలిడిటీతో ఉండే ప్లాన్స్ ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ ప్లాన్లు డేటా క్యాప్‌తో అన్లిమిటెడ్ డేటాతో ఉన్నాయి. ఎయిర్టెల్ కస్టమర్లు తమ వరల్డ్ పాస్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ని ఉపయోగించి మేనేజ్ చేయవచ్చు. అవసరానికి అనుగుణంగా అదనపు డేటా, మినిట్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
* వరల్డ్ పాస్ ప్లాన్ల ధరలు
* రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్
రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్ అదే ధరతో ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 1 రోజు వ్యాలిడిటీతో, 500MB డేటా లిమిట్ తర్వాత తగ్గిన వేగంతో అపరిమితమైన డేటా, 10 SMSలు, 100 కాలింగ్ మినిట్స్ ఉంటాయి.
* రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీ, 20SMSలు, 1GB డేటా, 100 నిమిషాల కాలింగ్‌తో వస్తుంది.
* రూ.2,998 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో 200 మినిట్స్ కాలింగ్, 30 రోజుల పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 20 ఫ్రీ SMSలను కూడా అందిస్తుంది.
* రూ.2,997 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 365 రోజుల పాటు 2GB డేటా, 100 నిమిషాల కాలింగ్, 20 ఫ్రీ SMSలతో వస్తుంది.
* రూ.649 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 500MB డేటా లభిస్తుంది. అనంతరం రెడ్యూస్డ్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. 1-డే వాలిడిటీతో 100 మినిట్స్ కాలింగ్‌ని కూడా అందిస్తుంది. 10 ఫ్రీ SMSలు కూడా ఉన్నాయి.
* రూ.2,999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100 మినిట్స్/డే కాలింగ్ మినిట్స్, 20 ఫ్రీ SMS, 5GB హై-స్పీడ్ డేటా లభిస్తాయి. డేటా పూర్తయితే రెడ్యూస్డ్ స్పీడ్‌లో అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది.
* రూ.3,999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100 మినిట్స్/డే కాలింగ్, 20 ఫ్రీ SMSలను అందిస్తుంది. ప్లాన్ 12GB హై-స్పీడ్ డేటాతో వస్తుంది. తక్కువ వేగంతో అపరిమిత డేటాను పొందుతారు.
* రూ.5,999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
900 మినిట్స్ కాలింగ్, 100 ఫ్రీ SMS, 90 రోజుల పాటు 2GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. హై-స్పీడ్ కోటా తర్వాత రెడ్యూస్డ్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా వినియోగించుకోవచ్చు.
* రూ.14,999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఎయిర్టెల్ ప్రస్తుతం అందిస్తున్న అత్యంత ఖరీదైన ఐఆర్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటా లిమిట్ అయిపోయిన తర్వాత తగ్గిన వేగంతో అపరిమిత డేటా వినియోగించుకోవచ్చు. 100 ఫ్రీ SMSలు లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, Tech news, Technolgy