హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel Smartphones: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్...త్వరలో చౌక 4జీ స్మార్ట్‌ఫోన్లు

Airtel Smartphones: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్...త్వరలో చౌక 4జీ స్మార్ట్‌ఫోన్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Airtel 4G Android Smartphones: తక్కువ ధరలకు 4జీ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫోన్ల తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

  Airtel 4G Android Smartphones: మార్కెట్‌లో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా వినియోగదారులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కాల్ ఛార్జీలు, డేటా ఛార్జీలు బాగా తగ్గడంతో వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కూడా టెలికాం సంస్థలు తీసుకొస్తుండటంతో అంతిమంగా వినియోగదారులకే ప్రయోజనం చేకూరుతోంది. ఆ రకంగా రిలయన్స్ జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ఆ రకంగా టెలికాం రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. తాజాగా ఎయిర్‌టెన్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం తక్కువ ధరలకు 4జీ ఆండ్రాయిట్ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తద్వారా తమ వినియోగదారుల సంఖ్యను, సేవలను మరింత విస్తరించేందుకు అవకాశాలు లభిస్తాయని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

  airtel smartphones, airtel 4g smartphones, airtel android smartphones, airtel low cost smartphones, airtel news, airtel offers, ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్స్, ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్, ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్
  ప్రతీకాత్మక చిత్రం

  తక్కువ ధరకు 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంపై పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ బ్రాండ్‌తోనే ఈ స్మార్ట్‌ఫోన్లను తయారు చేసి ఇచ్చేలా సదరు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో ఎయిర్‌టెల్ 4జీ సేవలను మాత్రమే వినియోగించేలా చౌక ధరకు స్మార్ట్‌ఫోన్లను తయారుచేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

  airtel smartphones, airtel 4g smartphones, airtel android smartphones, airtel low cost smartphones, airtel news, airtel offers, ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్స్, ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్, ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్
  ప్రతీకాత్మక చిత్రం

  దేశంలో డేటా ఛార్జీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నా...స్మార్ట్‌ఫోన్ల ఖరీదు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు వీటికి దూరంగా ఉంటున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే తక్కువ ధరలతో స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు అందించి సామాన్యులకు కూడా దగ్గరకావడం ద్వారా తమ వినియోగదారుల పరిధిని మరింత పెంచుకునేందుకు సొంత స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: AIRTEL, Smartphones

  ఉత్తమ కథలు