ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గురువారం తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్లను కొంత కాలంగా ఊరిస్తున్న 5జీ సర్వీసులను త్వరలోనే అందిస్తామన్న సంకేతాలు ఇచ్చింది. తాజాగా కంపెనీ హైదరాబాద్‌లో 5జీ సర్వీసులపై ఫీల్డ్ టెస్ట్ నిర్వహించింది. ఓ ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులను ఆవిష్కరించింది. 1800 మెగా హెర్జ్ట్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సరళీకరణతో ఎన్ఎస్ఏ నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవలను ఆవిష్కరించామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో 4జీ, 5జీ సేవలు అందించడం మొదటి సారని సంస్థ వివరించింది. అయితే 5G సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొంత కాలం పట్టే అవకాశముంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు, సరిపడినంత స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన అనంతరమే ఎయిర్‌టెల్ కస్టమర్లకు పూర్తి స్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
పది రెట్ల వేగం..
5జీ నెట్ వర్క్ ప్రస్తుతం వినియోగిస్తున్న నెట్ వర్క్ తో పోల్చితే దాదాపు 10 రెట్లు వేగంగా ఉంటుందని ఎయిర్టెల్ వివరించింది. వినియోగదారులు సిమ్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వాడుతున్న సిమ్ తోనే 5G సేవలను పొందొచ్చు. ఈ నెట్‌వర్క్ OPPO Reno 5 Pro, OPPO Find X2 Pro స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి పరీక్షించారు.
పరీక్షల్లో నెట్ వర్క్ స్పీడ్ 3Gbpsగా నమోదైంది. ఈ స్పీడ్ తో వినియోగదారులు పూర్తి నిడివి ఉన్న సినిమాను సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా కొత్త సాంకేతికతను కస్టమర్లకు అందించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని నిరూపితమైందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విట్లల్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, 5G Smartphone, AIRTEL, Hyderabad, Jio 5G