Home /News /technology /

AIRTEL GIVING 5 GB FREE DATA TO IT NEW PREPAID CUSTOMERS KNOW HOW TO GET BENEFIT KMV

Airtel Offer: ఎయిర్‌టెల్ పండుగ గిఫ్ట్.. కస్టమర్లకు 5 జీబీ డేటా ఉచితం!

Airtel Offers: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపరాఫర్.. 5 జీబీ డేటా ఉచితం!

Airtel Offers: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపరాఫర్.. 5 జీబీ డేటా ఉచితం!

Airtel Plans | మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? ఉచితంగానే 5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఎలా అని చూస్తున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Airtel Recharge Plans | పండుగ సీజన్ ముందు దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్ (Airtel) కస్టమర్ల కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 5 జీబీ డేటాను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ (Airtel Thanks App) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎయిర్‌టెల్ కంపెనీ కస్టమర్లకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను అందిస్తోంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా పలు రకాల సేవలు పొందొచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బిల్ పేమెంట్స్, ప్లాన్ మార్చుకోవడం ఇంకా ఇతర సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్.. ఫస్ట్ టైమ్ అతి తక్కువ ధరకే! అయితే ఇక్కడ 5జీ డేటా ఒకేసారి రాదు. ఈ 5జీ డేటా అనేది ఐదు కూపన్ల రూపంలో వస్తుంది. ఒక్కో కూపన్‌లో ఒక జీబీ డేటా వస్తుంది. కొత్తగా ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు కొన్న వారు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే వారికి ఈ 5జీజీ డేటా 5 కూపన్ల రూపంలో లభిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత కస్టమర్లు కూపన్ సెక్షన్‌లోకి వెళ్లి ఈ ఉచిత డేటాను పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ పది 5జీ ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. నెలకు రూ.600 కడితే చాలు! ప్రతి ఒక్క కొత్త కస్టమర్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఐదు కూపన్లు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంటోంది. ప్రతి కూపన్ విలువ ఒక జీబీ. యూజర్లు ఈ డేటా వోచర్లను 90 రోజుల లోగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అవి ఎక్స్‌పైర్ అవుతాయి. కొత్త ప్రిపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ఆఫర్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ యూజర్లు రెఫరల్ మీద రూ. 100 గెలుచుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ సిమ్ రెఫరల్ లింక్‌ను స్నేహితులకు పంపొచ్చు. అందువల్ల మీరు కూడా ఎయిర్‌టెల్ సిమ్ కార్డు తీసుకొని ఉంటే.. వెంటనే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి. ఐదు జీబీ ఉచిత డేటాను సొంతం చేసుకోండి. కాగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పలు ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా టెలికం కంపెనీలు యాప్ యూజర్లను పెంచుకోవడానికి వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Latest offers, Reliance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు