హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel Price Hike: ఎయిర్‌టెల్ సిమ్ వాడే వారికి భారీ షాక్!

Airtel Price Hike: ఎయిర్‌టెల్ సిమ్ వాడే వారికి భారీ షాక్!

Airtel Price Hike: ఎయిర్‌టెల్ సిమ్ వాడే వారికి భారీ షాక్!

Airtel Price Hike: ఎయిర్‌టెల్ సిమ్ వాడే వారికి భారీ షాక్!

Airtel Prepaid Plans | మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా? అయితే మీకు ఝలక్. ఎందుకంటే కంపెనీ అన్ని సర్కిళ్లలోనూ టారిఫ్ ధరలను పెంచేసింది. రీచార్జ్ ప్లాన్ ధర ఏకంగా 56 శాతం మేర పెరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Airtel Recharge Plans | ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఎయిర్‌టెల్ (Airtel) తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ప్రిపెయిడ్ రీచార్జ్ (Recharge) ప్లాన్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లపై ఎఫెక్ట్ అధికంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్ తాజాగా బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ రేటును పెంచేసింది. ఏకంగా 57 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఎయిర్‌టెల్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. కంపెనీ ఇది వరకే బేస్ ప్లాన్ ధరను పెంచేసింది. అయితే ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఈ ధరల పెంపు ముందుగా అమలు చేసింది. తర్వాత మరి కొన్ని సర్కిళ్లకు ఈ రీచార్జ్ ప్లాన్ ధరల పెంపును విస్తరించింది.

కిర్రాక్ ఆఫర్.. రూ.30 వేల డిస్కౌంట్, రూ.7,899కే అదిరే స్మార్ట్‌టీవీ!

అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలోనూ బేస్ ప్లాన్ ధరను పెంచేసింది. అంటే 22 సర్కిళ్లలోనూ ఇకపై బేస్ రీచార్జ్ ప్లాన్ ధర 57 శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. కంపెనీ తన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏఆర్‌పీయూను రూ. 200 పైకి తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

రూ.86 వేల స్మార్ట్‌టీవీని రూ.28,999కే పొందండి.. ఈ 58 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్!

ఎయిర్‌టెల్ కంపెనీ గత నవంబర్‌లో తొలిగా టారిఫ్ ధరను పెంచేసింది. ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ఒడిశా , హరియాణ వంటి సర్కిళ్లలో అమలులోకి తీసుకువచ్చింది. తర్వాత ఇతర సర్కిళ్లకు ఈ ధరల పెంపు విస్తరించింది. అందువల్ల కస్టమర్లకు ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. ఇది వరకు బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ. 99గా ఉండేది. అయితే ఇప్పుడు అన్ని సర్కిళ్లలోరూ బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ. 155కు చేరింది.

అంటే టారిఫ్ ధరలను ఏకంగా 56 శాతం మేర పెంచేసిందని చెప్పుకోవచ్చు. కేవలం ఐదు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా కంపెనీ ఈ టారిఫ్ ధరల పెంపును పూర్తిగా అమలులోకి తీసుకువచ్చింది. ఈ రూ. 155 రీచార్జ్ ప్లాన్‌తో కస్టమర్లకు ఒక జీబీ డేటా వస్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ ఉంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ మాత్రం కేవలం 24 రోజులు మాత్రమే. అలాగే సర్వీసులతో పాటుగా కస్టమర్లకు వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలో ట్యూన్స్ సర్వీసులు కూడా లభిస్తాయి.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, Mobile recharge, Recharge, Recharge plans

ఉత్తమ కథలు