హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Airtel prepaid plans | ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించే రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని పరిచయం చేసింది ఎయిర్‌టెల్.

  మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది ఎయిర్‌టెల్. రూ.448, రూ.599 ధరతో మరో రెండు ప్లాన్స్‌ని పరిచయం చేసింది. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ టెలికాం సంస్థలు పోటాపోటీగా అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా అందించే ప్లాన్స్‌ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ ప్రస్తుతం ప్రకటించిన ఈ రెండు ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఎక్కువ బెనిఫిట్స్‌తో రూ.448, రూ.599 ప్లాన్స్‌ని ప్రకటించింది కంపెనీ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఎక్కువగా వీడియోలు చూసేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

  Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్

  Airtel Rs 448 Plan: ఎయిర్‌టెల్ రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 3జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Airtel Rs 599 Plan: ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  ఈ రెండు ప్లాన్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించే ఇయర్లీ ప్లాన్ ఎయిర్‌టెల్‌లో ఉంది. రూ.2698 రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌పై డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ సబ్‌స్క్రిప్షన్స్ లేకుండా ఇవే డేటా, కాల్స్ బెనిఫిట్స్ కావాలంటే రూ.2498 రీఛార్జ్ చేస్తే చాలు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Technology

  ఉత్తమ కథలు