Home /News /technology /

AIRTEL ANNOUNCED RS 296 AND RS 319 PLANS WITH 30 DAYS VALIDITY KNOW BENEFITS SS

Airtel New Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Airtel New Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel New Plans: ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel New Plans | ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. రూ.296, రూ.319 ప్లాన్స్ ప్రకటించింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్స్‌తో (Airtel Plans) ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ (Prepaid Plans) ప్రకటించింది ఎయిర్‌టెల్. రూ.296, రూ.319 ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ నుంచి ఉన్న ప్లాన్స్ (Airtel Plans) లాగే ఈ ప్లాన్స్‌లో వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే ఈ రెండు ప్లాన్స్‌కు 30 రోజుల వేలిడిటీ ఉండటం విశేషం. టెలికామ్ కంపెనీలన్నీ 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జనవరిలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ 1999 లో సవరణలు కూడా చేసింది. టెలికామ్ ఆపరేటర్లు నెల అంటే 30 రోజుల వేలిడిటీ కాకుండా కేవలం 28 రోజుల వేలిడిటీతో ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తున్నారని యూజర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఒక్క ప్లాన్ అయినా 30 రోజుల వేలిడిటీతో ఉండాలని కోరింది.

ట్రాయ్ ఆదేశాలతో టెలికాం కంపెనీలు 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ రూ.296, రూ.319 ప్లాన్స్ తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ యూజర్లు రూ.296 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 25జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపోలో 24×7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి.

Samsung Galaxy A53: సాంసంగ్ గెలాక్సీ ఏ53 సేల్ ప్రారంభం... రూ.3,000 డిస్కౌంట్

ఇక రూ.319 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపోలో 24×7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి.

కొద్ది రోజుల క్రితం రిలయన్స్ జియో కూడా 'క్యాలెండర్ మంత్ వేలిడిటీ' పేరుతో రూ.259 ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ మంత్ అంటే ఉదాహరణకు మీరు ఏప్రిల్ 4న రీఛార్జ్ చేస్తే మళ్లీ మే 4న రీఛార్జ్ చేస్తే చాలు. ఇలా ప్రతీ నెలా 4వ తేదీన రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రూ.259 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

Samsung Galaxy M32 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 పైనే డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

మరోవైపు వొడాఫోన్ ఐడియా (Vi) కూడా 30, 31 రోజుల వేలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రూ.327 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ, 25జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక రూ.337 రీఛార్జ్ చేస్తే 31 రోజుల వేలిడిటీ, 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ రెండు ప్లాన్స్‌పై వీఐ మూవీస్, టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: AIRTEL, Airtel recharge plans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు